పుట:Oka-Yogi-Atmakatha.pdf/377

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మేము కాశ్మీరు వెళ్ళలేదు

341

ఆయనే, కొన్ని పరిహాసాలతో నన్ను ఆటపట్టించిన తరవాత ఆరు పాస్‌లూ ఒక పదిరూపాయల నోట్ల కట్టా నా చేతి కిచ్చారు.

“నీ ఉత్తుత్తి ప్రయాణానికి ఇలాంటి ఆధరువులేవీ అక్కర్లేదనుకుంటాను; అయినా ఇవిగో!” అని వ్యాఖ్యానించారు నాన్న గారు.

ఆరోజు మధ్యాహ్నం నేను దండుకున్నవి తెచ్చి శ్రీయుక్తేశ్వర్ గారి ముందు ప్రదర్శించాను. నా ఉత్సాహం చూసి ఆయన చిరునవ్వు చిందించారే కాని, ఆయన మాటలు మట్టుకు ఎటూ తేల్చలేదు: “నాకూ రావాలనే ఉంది; చూద్దాం.” వారి ఆశ్రమ విద్యార్థి అయిన కనాయిని కూడా తీసుకువెళ్దామని అన్నప్పుడు ఆయన ఏమీ వ్యాఖ్యానించలేదు. మరో ముగ్గురు స్నేహితుల్ని కూడా మాతో రమ్మని చెప్పాను.-- రాజేంద్రనాథ్ మిత్రా, జోతిన్ ఆడీ, మరో అబ్బాయి. మరుసటి సోమవారంనాడు బయల్దేరాలని నిర్ణయమైంది.

శని, ఆదివారాలు రెండు రోజులూ కలకత్తాలో ఉండిపోయాను; మా చుట్టాలబ్బాయి పెళ్ళి తతంగమంతా కలకత్తాలో మా ఇంట్లోనే జరుగుతోంది. నా సామాను తీసుకుని, సోమవారం పొద్దుట శ్రీరాంపూర్‌లో దిగాను. రాజేంద్ర ఆశ్రమ ద్వారం దగ్గర నన్ను కలుసుకున్నాడు.

“గురుదేవులు బయటికి షికారుకువెళ్ళారు. ఆయన రామంటున్నారు”

ఆ మాటకు నాకు ఎంత విచారం కలిగిందో అంత పట్టుదల కూడా పెరిగింది. “కాశ్మీరు వెళ్ళడానికి నేను భ్రమతో వేసిన పథకాలను నాన్నగారు మూడోసారి కూడా పరిహాసం చేసే అవకాశం నే నివ్వను. మిగిలిన వాళ్ళమే వెళ్ళాలి.”

రాజేంద్ర ఒప్పుకున్నాడు; ఒక నౌకరును సంపాదించడానికి నేను ఆశ్రమం నుంచి వెళ్ళాను. గురుదేవులు లేకుండా, కనాయి ప్రయాణం