పుట:Oka-Yogi-Atmakatha.pdf/375

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్‌లో కనిపించడం

339

తాన్ని బట్టి చూస్తే , ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒట్టి చిన్న పిల్లకాయల బడే అనిపిస్తోంది,”[1] అన్నాడు దిజేన్ .

  1. “నే నింతవరకు రాసిందంతా గడ్డిపరకకన్న విలువైందేమీ కాదని నాకు వెల్లడి అయిన విషయాలు తెలియబరిచాయి,” అన్నాడు. “ప్రిన్స్ ఆఫ్ స్కొలాస్టిక్స్" (తత్త్వశాస్త్రాధిపతి) గా ప్రసిద్ధులైన సెంట్ థామస్ ఎర్వనాస్. ‘సమ్మా థియొలాజియే’ అన్న గ్రంథం పూర్తి చెయ్యమంటూ తన అంతరంగిక కార్యదర్శి, మనసుపడుతూ చేసిన విన్నపాలకు ఆయన ఇచ్చిన సమాధానమిది. 1273 లో ఒకనాడు నేపుల్స్ చర్చిలో సామూహిక ప్రార్థన జరుగుతూ ఉండగా, సెంట్ థామస్‌కు గాఢమైన ఆత్మజ్ఞానం అనుభూతమైంది. ఆ దివ్యజ్ఞాన మహిమ ఆయన్ని ఎంత ఆనందభరితుణ్ణి చేసిందంటే, అప్పటినుంచి ఆయన బౌద్ధికమైన తర్కవితర్కాలమీది ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు.

    ఇలాగే సోక్రటీస్ (ప్లేటో ‘ఫేడ్రన్’లో) మాటలు గమనించండి: “నా మట్టుకు నాకు తెలిసిందల్లా, నా కేమీ తెలియదనే.”