పుట:Oka-Yogi-Atmakatha.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్‌లో కనిపించడం

335

అప్పటికే బయల్దేరడానికి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న దిజేన్‌కు ఈ తాజా కబురు చెప్పాను.

“నువ్వూ నీ అంతఃప్రేరణా!” అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చీదరింపు ధ్వనించింది. “గురువుగారు రాసిందాన్నే నమ్ముతాను నేను.”

నేను భుజాలు ఎగరేసి నిశ్చింతగా కూర్చున్నాను. దిజేన్ కోపంగా గొణుక్కుంటూ గుమ్మందాటి దభీమని తలుపు వేశాడు.

గది కొద్దిగా చీకటిగా ఉండడంవల్ల నేను వీధివేపు కిటికీకి దగ్గరగా జరిగాను. కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతీ హఠాత్తుగా పెరిగిపోయి తీక్ష్ణంగా ప్రకాశించింది; కిటికీ ఇనప చువ్వలు పూర్తిగా మాయమైపోయాయి. మిరుమిట్లు గొలుపుతున్న ఈ నేపథ్యంలో, శ్రీయుక్తేశ్వర్ గారి భౌతికరూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది!

ఆశ్చర్యంతో అదిరిపడి, కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను. సాంప్రదాయిక పద్ధతిలో నేను, గురుదేవుల పాదాలకు గౌరవపురస్సరంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలు ముట్టుకున్నాను. ఈ జత నాకు తెలిసినదే; కాషాయంరంగు అద్దిన కేన్వాసుతో చేసినది; దాని అడుగుభాగం తాళ్ళతో చేసింది. ఆయన వేసుకున్న కాషాయంరంగు బట్ట నా ఒంటికి రాసుకుంది. ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా, ఆయన బూట్లమీది గరుకుదనం, వాటిలో ఆయన కాలివేళ్ళ ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది. ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలుకానంతగా కొయ్యబారి, లేచి నించుని ప్రశ్నార్థకంగా ఆయనవేపు తేరిపారి చూశాను.

“నువ్వు నా మానసిక సందేశం అందుకున్నందుకు సంతోషిం