పుట:Oka-Yogi-Atmakatha.pdf/363

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లిం గారడివాడు

327

“వెంటనే బాబు వెర్రెత్తినవాడిలా ఇంటికి పరిగెత్తాడు. కాసేపట్లో తిరిగివచ్చి అఫ్జల్‌కు కావలసిన డబ్బు చేతిలో పెట్టాడు.”

“ ‘మీ ఇంటి దగ్గరున్న చిన్నవంతెన దగ్గరికి వెళ్ళు,’ అని పురమాయించాడు ఫకీరు. ‘హజరత్‌ను పిలిచి, గడియారమూ గొలుసూ తెచ్చి ఇమ్మని అడుగు.”

“బాబు అక్కణ్ణించి ఉరికాడు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం, ఒంటిమీద విలువైన వస్తువేది లేకుండా నిశ్చింతగా నవ్వుకుంటూ వచ్చాడు.”

“ ‘చెప్పిన ప్రకారం నేను హజరత్‌ను పిలిచాను’ అని చెప్పాడతను. ‘నా గడియారం గాలిలో దొర్లుకుంటూ వచ్చి నా కుడి చేతిలో పడింది! మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ కలుసుకోడానికి వచ్చేముందు దాన్ని ఇనప్పెట్టెలో పెట్టి తాళంవేసి మరీ వచ్చాను!’ ”

“గడియారానికి బదులుగా జబర్దస్తీగా డబ్బు వసూలు చేసుకున్న ఈ సుఖాంత - విషాదాంత నాటకానికి సాక్షులైన బాబు స్నేహితులు, అఫ్జల్‌ను చీదరించుకుంటూ చూశారు. అప్పుడతను బుజ్జగింపు ధోరణిలో ఇలా అన్నాడు:

“ ‘మీకు కావలసిన పానీయం ఏదైనా ఒకటి చెప్పండి; హజరత్ దాన్ని తెచ్చి ఇస్తాడు.”

“కొందరు పాలు అడిగారు, తక్కినవాళ్ళు పళ్ళరసాలు అడిగారు. డీలాపడ్డ బాబు, విస్కీ కావాలని అడిగినప్పుడు నేను ఏమంత ఆశ్చర్య పోలేదు! ఫకీరు వెంటనే పురమాయింపు చేశాడు. ఆజ్ఞాబద్ధుడైన హజరత్, సీలువేసిన పెట్టెల్ని వెంటనే దిగుమతి చేశాడు; అవి కిందికి దిగివచ్చి దబ్బున నేలకు తగిలాయి. ప్రతి ఒక్కరికీ తమకు కావలసిన పానీయం దొరికింది.