పుట:Oka-Yogi-Atmakatha.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముస్లిం గారడివాడు

325

కాని అఫ్జల్ సపరివారంగా బండి ఎక్కగానే కావలసిన టిక్కెట్లు అతనికి చిక్కేవి.[1]

“ఈ దోపిడీలవల్ల క్రోధావేశాలు చెలరేగేవి; బెంగాలీ నగల వ్యాపారులూ, టిక్కెట్ల అమ్మకందార్లూ గుండె పగిలి బేజారెత్తిపోయేవారు! అఫ్జల్‌ను అరెస్టు చెయ్యాలని చూసిన పోలీసులు కూడా నిస్సహాయులయారు; తన నేరం పట్టుబడే సాక్ష్యాధారం ఏదైనా ఉంటే, ‘హజరత్, దీన్ని తీసెయ్’ అని అఫ్జల్ అంటే చాలు, అది కాస్తా అదృశ్యమయి పోయేది.”

శ్రీయుక్తేశ్వర్‌గారు తమ ఆసనం మీదనుంచి లేచి, గంగానదికి ఎదురుగా ఉన్న నా గది బాల్కనీలోకి నడిచారు. అంతమందిని గాభరా పెట్టిన ఆ ముస్లిం ఫకీరునుగురించి ఇంకా వినాలన్న కుతూహలంతో నేను కూడా ఆయన వెనకాల వెళ్ళాను.

“ఈ పాంథీ భవనం ఒకప్పుడు మా స్నేహితుడిది. అప్జల్ తో అతనికి పరిచయమైంది. ఒకసారి ఇక్కడికి తీసుకువచ్చాడు. మా స్నేహతుడు నాతోబాటు మరో ఇరవై మంది ఇరుగుపొరుగువాళ్ళని రమ్మని పిలిచాడు. నే నప్పుడు బాగా కుర్రవాణ్ణి. ఆ ఫకీరు చేసే అద్భుతచర్యలు చూడాలని ఆసక్తి కలిగింది.” గురుదేవులు నవ్వారు. “నేను విలువైనదేదీ ఒంటిమీద లేకుండా ముందే జాగ్రత్త పడ్డాను! అఫ్జల్ నావేపు కుతూహలంగా చూశాడు. ఆ తరవాత ఇలా అన్నాడు:

“ ‘నీ చేతులు మంచి బలంగా ఉన్నాయి. మెట్లు దిగి తోటలోకి వెళ్ళు; అక్కడో నున్నటిరాయి తీసుకుని, దానిమీద సుద్దముక్కతో

  1. అఫ్జల్‌ఖాన్ దోపిడికి గురిఅయిన వ్యాపార సంస్థల్లో తమ కంపెనీ, బెంగాల్ - నాగపూర్ రైల్వే కూడా ఒకటని, తరవాత ఒకసారి మా నాన్నగారు నాకు చెప్పారు.