పుట:Oka-Yogi-Atmakatha.pdf/358

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 18

ముస్లిం గారడివాడు

‘కొన్నేళ్ళ క్రితం, నువ్విప్పుడుంటున్న ఈ గదిలోనే ఒక ముస్లిం గారడివాడు నా ఎదుట నాలుగు అలౌకిక ఘటనలు ప్రదర్శించాడు!’

మా గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారు మొట్ట మొదటిసారి నా కొత్త బసకు వచ్చినప్పుడు చెప్పిన సంగతి ఇది. శ్రీరాంపూర్ కాలేజీలో చేరీ చేరగానే నేను దగ్గరలో ఉన్న ‘పాంథీ’[1] అనే వసతిగృహంలో ఒక గది తీసుకున్నాను. అది పాతకాలపు పద్ధతిలో కట్టిన ఇటిక కట్టుబడి భవనం; గంగానదికి అభిముఖంగా ఉంది.

“గురుదేవా, ఎంత చిత్రంగా కలిసింది! కొత్తగా అలంకారాలు దిద్దుకున్న ఈ గోడలు పాత జ్ఞాపకాలతో అంత ప్రాచీనమైనవా?” కొద్దిపాటి ఉపకరణ సామగ్రితో సాదాగా ఏర్పాటయి ఉన్న నా గది చుట్టూ, కొత్తగా రేకెత్తిన ఆసక్తితో కలయజూశాను.

“అది చాలా పెద్దకథ.” అంటూ పాత జ్ఞాపకాలతో చిరునవ్వు నవ్వారు గురుదేవులు. ఆ ఫకీరు[2] పేరు అఫ్జల్ ఖాను. అనుకోకుండా తారస

  1. విద్యార్థుల వసతి గృహం: బాటసారి, జ్ఞానాన్వేషకుడు అనే అర్థంగల ‘పాంథ’ శబ్దం నుంచి వచ్చింది.
  2. ముస్లింయోగి; అరబ్బీ భాషలో, దరిద్రుడనే అర్థంగల ‘ఫకీర్’ శబ్దం నుంచి వచ్చింది. దీని మూలార్థం దారిద్ర్యవ్రతనిష్ఠుడని,