పుట:Oka-Yogi-Atmakatha.pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శశి, మూడు నీలాలు

317

వెంటనే నా భయంకర రోగ లక్షణాలన్నీ మటుమాయమయాయి. ఆయన దయవల్ల, నాకు పూర్తిగా బాగయినట్టు అనిపిస్తోంది.”

కొద్ది వారాల్లో శశి బాగా ఒళ్ళు చేశాడు. అదివరకు ఎన్నడూ లేనంతగా వాడి ఆరోగ్యం మెరుగుపడింది.[1] అయితే రోగం నయమైన మీదట వాడి వైఖరిలో కృతఘ్నత మిళితమైంది; మళ్ళీ శ్రీయుక్తేశ్వర్ గారిని దర్శించడం అరుదైపోయింది! ఒకనాడు వీడు నాతో అన్నాడు, తన వెనకటి జీవన విధానానికి గాఢంగా పశ్చాత్తాపపడుతూ, గురుదేవుల ఎదుట పడాలంటే ముఖం చెల్లడంలేదని అన్నాడు.

అయితే, శశికి వచ్చిన జబ్బు ఒక పక్క వాడి సంకల్పశక్తిని దృఢంచేసి మరోపక్క వాడి నడతకు చెరుపుచేసి విరుద్ధ ఫలితాలు చూపించిందని నాకు నిర్ధారణ అయింది.

స్కాటిష్ చర్చి కాలేజిలో నా మొదటి రెండేళ్ళ చదువు పూర్తి కావచ్చింది. తరగతి గదుల్లో నా హాజరు అరుదయిపోయింది. నేను సాగించిన కొద్దిపాటి చదువూ ఇంట్లో పోరులేకుండా చేసుకోడానికే. నా ప్రయివేటు ట్యూటర్లు ఇద్దరూ యథావిధిగా వస్తూండేవారు; నేను మాత్రం యథావిధిగా గైర్‌హాజరు; నా విద్యాభ్యాస జీవితంలో కనిపించే క్రమబద్ధత ఇదొక్కటే అనుకుంటాను!

భారతదేశంలో కాలేజిలో రెండేళ్ళ చదువు పూర్తి చేసి ఉత్తీర్ణులయితే ఇంటర్మీడియట్ ఆర్ట్స్ డిప్లమా వస్తుంది. ఆ తరవాత విద్యార్థి, మరో రెండేళ్ళకు బి. ఏ. డిగ్రీకోసం ఎదురు చూడవచ్చు.

ఇంటర్మీడియట్ ఆర్ట్స్ చివరి పరీక్షలు అరిష్టంలా ఎదుట కనిపిస్తు

  1. శశి ఆరోగ్యం ఇప్పటికీ అద్భుతంగానే ఉందని 1956 లో ఒక స్నేహితుడు చెప్పగా విన్నాను.