పుట:Oka-Yogi-Atmakatha.pdf/350

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

314

ఒక యోగి ఆత్మకథ

“ఇంకో ఏడాదిలో నువ్వు మూడు నీలాలు తెస్తావు,” అని చెబుతూ శ్రీ యుక్తేశ్వర్‌గారు, “అప్పుడింక వాటితో పని ఉండదు,” అని కూడా అన్నారు.

ఈ విషయంలో ప్రతిరోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉండేది. “నేను మారలేను!” అంటూ హాస్యాస్పదమైన నిస్పృహతో అంటూండే వాడు శశి. “అయినా గురుదేవా, మీ మీద నాకున్న విశ్వాసం, రాయి కన్న నాకు అమూల్యమయింది!”

ఒక ఏడాది గడిచింది, ఒకనాడు మా గురుదేవులు కలకత్తాలో నరేన్‌బాబు అనే శిష్యుడి ఇంట్లో ఉండగా నేను ఆయన దర్శనానికి వెళ్ళాను. పొద్దుట సుమారు పది గంటలవేళ. శ్రీ యుక్తేశ్వర్‌గారూ నేనూ రెండో అంతస్తులో కూర్చుని ఉండగా వీథి గది తలుపు తెరుచుకున్న అలికిడి అయింది. గురుదేవులు బింకంగా నిటారుగా మారారు.

“ఆ వచ్చినవాడు శశి,” అన్నారు గంభీరంగా. “ఇప్పటితో ఏడాది గడిచిపోయింది. అతని ఊపిరితిత్తులు రెండూ చెడిపోయాయి. అతను నా మాట లెక్క పెట్టలేదు. నే నిప్పుడు చూడదలుచుకోలేదని అతనికి చెప్పు.”

శ్రీయుక్తేశ్వర్‌గారి నిష్ఠురతకు నేను కొంచెం కొయ్యబారి, గబగబా మెట్లమీంచి కిందికి పరిగెత్తాను. శశి మెట్లెక్కుతున్నాడు.

“ఓ ముకుందా! గురువుగారు ఇక్కడే ఉన్నారనుకుంటాను. నా మనను కలా అనిపించింది.”

“ఉన్నారు. కాని ఇప్పుడెవరూ ప్రశాంతికి భంగం కలిగించడం ఆయనకు ఇష్టం ఉండదు.”

శశికి గభాలున కళ్ళనీళ్ళు వచ్చాయి. నన్ను దూసుకుంటూ పైకి