పుట:Oka-Yogi-Atmakatha.pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 17

శశి, మూడు నీలాలు

“నువ్వూ మా అబ్బాయీ శ్రీ యుక్తేశ్వర్‌స్వామి గురించి ఎంతో గొప్పగా తలుస్తున్నారు కనక నేనోసారి అలా చూసి వస్తాను.” అన్నాడు డా॥ నారాయణచందర్‌రాయ్‌గారు. ఆయన కంఠస్వరంలో, వెర్రిబాగుల వాళ్ళని వేళాకోళం చేసే తీరు ధ్వనించింది. అయితే, అవతలివాళ్ళని తన మతంలోకి మార్చడానికి ప్రయత్నించే ప్రచారకుడు పాటించే సత్సంప్రదాయాల్ని అనుసరించి నేను, నా కోపాన్ని పైకి కనిపించకుండా చేసుకున్నాను.

కలకత్తాలో పశువైద్యులుగా ఉన్న డా॥ రాయ్‌గారు, అచ్చుగుద్దిన అజ్ఞేయవాది (అగ్నాస్టిక్). ఆయన చిన్న కొడుకు సంతోష్, వాళ్ళ నాన్న గారి విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోమని నన్ను ప్రాధేయపడ్డాడు. ఇంతవరకు నా అమూల్యమైన సహాయం అదృశ్యంగానే ఉంటూ వచ్చింది.

ఆ మర్నాడు డా॥ రాయ్ నాతో శ్రీరాంపూర్ ఆశ్రమానికి వచ్చారు. తమను కలుసుకోడానికి గురుదేవులు ఆయనకి అనుమతి ఇచ్చిన తరవాత, వారు కలిసిన కొద్దిసేపూ ఇద్దరి మధ్యా మాటామంతీ లేకుండానే గడిచిపోయింది, చూడవచ్చినాయన హఠాత్తుగా లేచి వెళ్ళి పోయారు.

“చనిపోయినవాణ్ణి ఆశ్రమానికెందుకు తీసుకువచ్చావు?” అంటూ