పుట:Oka-Yogi-Atmakatha.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

302

ఒక యోగి ఆత్మకథ

భారతదేశపు మహాగురువులు, క్రీస్తుకు ఉత్తేజం కలిగించిన దివ్యాదర్శాల్నే అనుసరించి తమ జీవితాల్ని మలుచుకున్నారు: ఈ మహాపురుషులు. ఆయన తనవాళ్ళుగా చాటుకొన్న ఆత్మబంధువులు: “స్వర్గంలో ఉన్న నా తండ్రి ఇచ్ఛను అనుసరించే ప్రతివ్యక్తి నాకు సోదరుడు, సోదరి, తల్లి , "[1] క్రీస్తు ఇంకా ఇలా అన్నాడు: “నా మాట ననుసరించి మీరు ముందుకు సాగితేనే మీరు నిజంగా నాకు శిష్యులు; అప్పుడు మీకు సత్యం అవగతమవుతుంది; ఆ సత్యం మీకు విముక్తి కలిగిస్తుంది.”[2] అందాకా స్వేచ్ఛాజీవులయి, తమకు తామే ప్రభువులయి ఏకైక జగత్పితనుగురించి ముక్తిదాయకమైన జ్ఞానాన్ని ఆర్జించుకొన్న, క్రీస్తువంటి, భారతీయ యోగిపుంగవులు అమరబంధుకోటిలో అంతర్భాగమే:

“ఆదాము, అవ్వల కథ నాకు కొరుకుడు పడకుండా ఉందండి!” అన్నా నొక రోజున. వ్యంగ్యాత్మక కథలతో సతమతమవుతున్న తొలి కాలంలో కొంత ఉద్రేకంతోనే అన్నాను. “నేరం చేసిన జంటనే కాకుండా అప్పటికింకా పుట్టని ముందుతరాల అమాయకుల్ని కూడా ఎందుకు శిక్షించాడు దేవుడు?”

గురుదేవులకు నా అజ్ఞానంకంటె కూడా నా మాటల్లో తీవ్రతకే నవ్వు వచ్చింది. “సృష్టి ప్రకరణం (జెనిసిస్) చాలా గహనమైన ప్రతీకలతో కూడి ఉన్నది. కేవలం శబ్దార్ద వివరణవల్ల అవగాహన కాదు,” అని

  1. మత్తయి 12 : 50.
  2. యోహాను 8 : 31-32. సెంట్ జాన్ ఇలా ధ్రువపరిచాడు: “తనను స్వీకరించిన వాళ్ళందరికీ ఆయన, దేవుడి కుమాళ్ళు కాగల శక్తి ఇచ్చాడు; తన పేరు మీద విశ్వాసముంచినవాళ్ళకి సైతం ఇచ్చాడు (సర్వవ్యాపక కూటస్థ చైతన్యంలో స్థిరపడ్డవాళ్ళకి సైతం ఇచ్చాడు).” - యోహాను 1 : 12.