పుట:Oka-Yogi-Atmakatha.pdf/336

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

300

ఒక యోగి ఆత్మకథ

వుల్లో, సృష్టికర్తతో తమకున్న విడదీయరాని దివ్య ఏకత్వాన్ని గురించిన స్పృహ పెరిగినకొద్దీ, వాళ్ళలో ఒకరి తరవాత ఒకరు మాయాద్వంద్వం నుంచి విముక్తి పొందుతారు.

గురుదేవులు, జ్యోతిషశాస్త్రవిషయంలోనే కాక, ప్రపంచ ధార్మిక గ్రంథాల విషయంలో కూడా నా అవగాహనను విస్తృతం చేశారు. పవిత్ర గ్రంథాల్ని ఆయన, మనస్సనే నిర్మల ఫలకం మీద పెట్టి, సహజావబోధ యుక్తమైన తర్కమనే శస్త్రంతో విశ్లేషిస్తూ ఉండేవారు; ప్రవక్తలు మౌలికంగా వ్యక్తంచేసిన సత్యాల్లోంచి పండితుల దోషాల్నీ ప్రక్షిప్తాల్నీ ఏరేస్తూ ఉండేవారు.

“చూపును ముక్కుకొన మీద నిలపాలి.” భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకానికి[1] తప్పుడు వ్యాఖ్యానమిది. ప్రాచ్య పండితులూ పాశ్చాత్య అనువాదకులూ చాలామంది దీన్ని అంగీకరించారు. గురుదేవులు దీన్ని వేళాకోళంగా విమర్శిస్తూ ఉండేవారు.

“యోగి అనుసరించే మార్గమే వింత మార్గం. దానికి తోడు అతన్ని మెల్లకన్ను తెప్పించుకోమని కూడా సలహా ఇవ్వడమెందుకు?” అనేవారు. ‘నాసికాగ్రం’ అన్న దానికి సరయిన అర్థం, ‘ముక్కుకు మూలమైన స్థానం’ అనే కాని ‘ముక్కుకొస’ అని కాదు. కనుబొమల మధ్య ఆధ్యాత్మిక దృష్టికి స్థానమైన చోట ముక్కు మొదలవుతుంది.”[2]

  1. అధ్యాయం 4 : 13.
  2. “ఒంటికి వెలుతురు కన్ను : కనక నీది ఒక్కటే కన్నయితే నీ ఒళ్ళంతా వెలుతురుతో నిండినవే అవుతుంది; కాని నీ కన్ను చెరుపయితే నీ ఒళ్ళు కూడా అంతా చీకటితో నిండి ఉంటుంది. కనక నీలో ఉన్న వెలుతురు చీకటి అయిపోకుండా చూసుకో.” లూకా 11: 34-35.