పుట:Oka-Yogi-Atmakatha.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

293

“సాధారణ ప్రయోజనాలకయితే నేను, బంగారం, వెండి, రాగితో చేసిన కడియం వేసుకోమంటాను. కాని ఒక నిర్దిష్ట ప్రయోజనంకోసం నువ్వు వెండి, సీసంతో చేసింది సంపాదించాలి,” అని చెప్తూ శ్రీ యుక్తేశ్వర్‌గారు జాగ్రత్తకోసం కొన్ని సూచనలు కూడా చేశారు.

“గురుదేవా, ‘నిర్దిష్ట ప్రయోజనం’ అనడంలో మీ అబిప్రాయం ఏమిటి?”

“గ్రహాలు త్వరలో నీ మీద ‘అమిత్ర’ భావం చూపించబోతున్నాయి ముకుందా, భయపడకు; నీకు కాపుదల ఉంటుంది. సుమారు ఒక నెల్లాళ్ళలో నీ కాలేయం నిన్ను చాలా బాధపెడుతుంది. లెక్క ప్రకారం ఆ జబ్బు ఆర్నెల్లపాటు ఉండాలి. కాని నువ్వు వేసుకొనే జ్యోతిష సంబంధమైన కడియం, ఆ కాలాన్ని ఇరవైనాలుగు రోజులకు తగ్గించేస్తుంది.”

ఆ మర్నాడు నేనొక కంసాలిని పట్టుకుని, త్వరలోనే కడియం సంపాదించి వేసేసుకున్నాను. నా ఆరోగ్యం అద్భుతంగా ఉంది; గురుదేవుల జోస్యం నా మనస్సులోంచి ఎప్పుడో తొలగిపోయింది. గురువుగారు శ్రీరాంపూర్ నుంచి కాశీ వెళ్ళారు. మా సంభాషణ జరిగిన తరవాత ముప్ఫై రోజులకి, నా కడుపులో కాలేయందగ్గర హఠాత్తుగా నొప్పి వచ్చింది. అప్పటినించి కొన్ని వారాలపాటు యమబాధ పడ్డాను. గురువుగారిని తొందరపెట్టడం ఇష్టంలేక, ఈ పరీక్షకు ఒంటరిగానే తట్టుకోవాలనుకున్నాను.

కానీ ఇరవైమూడు రోజుల యమయాతన నా పట్టుదలని సడలించేసింది. కాశీకి రైలెక్కాను. అక్కడ శ్రీ యుక్తేశ్వర్‌గారు అసాధారణమైన ఆప్యాయతతో నన్ను పలకరించారే కాని, అంతరంగికంగా నా బాధలు చెప్పుకోడానికి అవకాశం ఇవ్వలేదు. ఆనాడు కేవలం ఆయన