పుట:Oka-Yogi-Atmakatha.pdf/326

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

290

ఒక యోగి ఆత్మకథ

టితమయ్యే సందేశం, విధిని – అంటే వెనకటి మంచి చెడ్డల కర్మఫలాన్ని – నొక్కిచెప్పడానికి కాదు; ప్రాపంచిక బంధంనుంచి బయటపడాలన్న ఇచ్ఛ మనిషిలో రగుల్కొల్పడానికే. తాను చేసినదాన్ని తాను మార్చుకోనూ గలడు. అతని జీవితంలో ఇప్పుడు ఏయే ఫలితాలు కనిపిస్తున్నాయో వాటికి మూలకారకుడు అతనే కాని మరెవరూ కాదు. అతను ఏ అవరోధాన్నయినా అధిగమించగలడు; దానికి కారణాలు ఏమిటంటే, అసలు ఆ అవరోధాన్ని కల్పించుకున్నది తానే కావడం ఒకటి, గ్రహాల ఒత్తిళ్ళకు లోబడని ఆధ్యాత్మికశక్తులు అతనికి ఉండడం ఒకటి.

“జ్యోతిషంమీద మూఢభక్తి మనిషిని, యాంత్రిక మార్గదర్శకత్వంమీద గట్టిగా ఆధారపడే మరమనిషిగా తయారుచేస్తుంది. కాని వివేకవంతుడు తన భక్తి ప్రపత్తులను సృష్టిమీదినుంచి సృష్టికర్తమీదికి మళ్ళించి తన గ్రహాల్ని ఓడిస్తాడు. అంటే తన గతాన్ని వమ్ముచేస్తాడు. పరమాత్మతో తనకుగల ఏకత్వాన్ని అతను ఎంత ఎక్కువగా గ్రహిస్తూంటే భౌతిక ప్రపంచం అతనిమీద ప్రాబల్యం వహించడం అంతగా తగ్గుతూ ఉంటుంది. ఆత్మ ఎప్పుడూ స్వేచ్ఛగా ఉండేదే; దానికి పుట్టుక లేదు; కనక చావూలేదు. గ్రహ నక్షత్రాలు దానిమీద ఆధిపత్యం వహించలేవు.

“మనిషంటే ఆత్మ; దానికో శరీరం ఉంటుంది. అతను తానెవరో సరిగా తెలుసుకొన్నప్పుడు నిర్బంధకాల్ని అన్నిటినీ విడిచిపెట్టేస్తాడు. అతను ఆధ్యాత్మిక విస్మృతి అనే తన సాధారణస్థితిలో గందరగోళంలో పడి ఉన్నంతకాలం పరిసరనియమం తాలూకు సూక్ష్మశృంఖలాల్లో చిక్కుకొనే ఉంటాడు.

“దేవుడంటే సామరస్యం; దేవుడితో ఐక్యానుసంధానం పొందిన భక్తుడు ఏ పనీ తప్పుగా చెయ్యడు. అతని కార్యకలాపాలు జ్యోతిష