పుట:Oka-Yogi-Atmakatha.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రహాల్ని ఓడించడం

289

“సృష్టిలో భాగాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి; వాటి ప్రభావాల్ని పరస్పరం మార్చుకుంటూ ఉంటాయి. విశ్వానికున్న సంతులిత లయ ఈ పరస్పర ఆదానప్రదానాల్లో నెలకొని ఉంది,” అంటూ మా గురుదేవులు ఇంకా ఇలా అన్నారు: “మనిషి, తన మానవ ప్రకృతినిబట్టి రెండు రకాల శక్తుల్ని ఎదుర్కోవాలి - ఒకటి, పృథివ్యాపస్తేజోవాయు రాకాశా లనే పంచభూతాల కలయికవల్ల తనలో ఏర్పడ్డ కల్లోలాలు; రెండోది, ప్రకృతిలోని బాహ్య విఘటన శక్తులు. మానవుడు తన నశ్వరత్వంతో పెనుగులాడుతూ ఉన్నంతకాలం, భూమ్యాకాశాల్లో జరిగే అసంఖ్యాకమైన పరిణామాలవల్ల ప్రభావితుడవుతూనే ఉంటాడు.

“జ్యోతిష మన్నది, గ్రహాల ఉద్దీపనలకు మనిషిలో కలిగే ప్రతిస్పందనల్ని వివరించే శాస్త్రం. నక్షత్రాలకు ఉద్దేశపూర్వకమైన మిత్రభావంకాని, శత్రుభావంకాని ఉండవు; అవి కేవలం అనుకూల, ప్రతికూల కిరణాల్ని ప్రసరిస్తూ ఉంటాయంతే. వాటంతట అవి మానవులకు మేలూ చెయ్యవు, కీడూ చెయ్యవు; కాని ప్రతి మనిషీ గతంలో తాను గతి కల్పించిన కార్యకారణ సంతులనాల బాహ్య పరిక్రియకు అవి నియమబద్ధమైన ఒక మార్గాన్ని ఏర్పరుస్తాయి.

“ఫలానా రోజున, ఫలానా సమయంలో ఒక పసివాడు పుట్టాడంటే, ఖగోళకిరణాలు గణితశాస్త్రపరంగా అతని వైయక్తిక కర్మకు కచ్చితంగా అనుగుణమై ఉన్న సమయంలో వాడు పుట్టాడన్నమాట. అతని జాతకం, మార్చడానికి వీలులేని గతాన్నీ, సంభావ్యమైన అనాగత ఫలితాల్ని వెల్లడించే నిరాక్షేపణీయమైన ప్రతిరూపమన్నమాట. సహజావబోధం ఉన్నవాళ్ళే జాతక చక్రాన్ని సరిగా అన్వయంచేసి చెప్పగలరు; వీళ్ళు బహుకొద్ది.

“పసివాడు పుట్టిన సమయంలో ఆకాశంలో ప్రస్ఫుటంగా ప్రక