పుట:Oka-Yogi-Atmakatha.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

286

ఒక యోగి ఆత్మకథ

పోయిన అతిథుల్ని వంటింట్లోకి తీసుకు వెళ్ళాను. మిలమిలా మెరుస్తున్న కళ్ళతో గురుదేవులు నావేపు తిరిగారు.

“ఇప్పుడు నువ్వు ఇద్దరు చెప్పినవీ తై పారు చేశావు కనక, మన అతిథులకి నిజంగానే బండి తప్పిపోయినందుకు తృప్తిపడుతున్నావనడంలో సందేహం లేదు!”

ఒక అరగంట తరువాత నేను, దేవుడిలాటి గురువుగారి పక్కన నిద్రపోయే భాగ్యానికి ఆనందంగా ఎదురుచూస్తూ ఆయన వెంబడే, ఆయన పడగ్గదికి వెళ్ళాను.