పుట:Oka-Yogi-Atmakatha.pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

283

సద్యఃప్రభావాన్ని ప్రదర్శిస్తుంది. ప్రాచ్య పాశ్చాత్యదేశాల మహనీయమైన ధార్మిక సంగీతం మానవుడికి ఆనందాన్ని ప్రసాదిస్తుంది; అతని షట్చక్రాల్లో[1] ఒకదాన్ని అది తాత్కాలికంగా స్పందనశీలంగా జాగృతం చేస్తుంది. ఆనందభరితమైన ఆ క్షణాల్లో అతనికి, తనకు మూలమైన దివ్యస్వరూపం లీలగా స్మృతికి వస్తుంది.

పండుగ రోజున శ్రీ యుక్తేశ్వర్‌గారి రెండో అంతస్తులో జరుగుతున్న సంకీర్తనం, కింద ఆవిర్లు కక్కుతున్న గుండిగల మధ్య పని

  1. నిగూఢమైన సుషుమ్ననాడీ కేంద్రాల్ని (చక్రాలు, సూక్ష్మరూపమైన పద్మాలు) మేల్కొల్పడమే యోగి పవిత్ర లక్ష్యం. బైబిలు కొత్త నిబంధన గ్రంథంలో “ప్రకటన” అనే అధ్యాయంలో, ఏసుప్రభువు యోహానుకూ సన్నిహితులైన ఇతర శిష్యులకూ బోధించిన ఒకానొక యోగశాస్త్రానికి ప్రతీకాత్మకమైన నిరూపణ ఉందన్న సంగతి పాశ్చాత్య భాష్యకారులు అర్థం చేసుకోలేదు. యోహాను (ప్రకటన 1 : 20) “ఏడు నక్షత్రాల మర్మం”, “ఏడు సంఘాలు” పేర్కొన్నాడు; ఈ ప్రతీకలు, మేధోమేరు దండాక్షంలో ఏడు “బోను తలుపులు”గా యోగశాస్త్ర గ్రంథాల్లో వర్ణించిన ఏడు తేజఃపద్మాల్నీ సూచిస్తాయి. దైవనియోజిత మైన ఈ “నిర్గమన ద్వారాల” గుండా యోగి, శాస్త్రీయమైన ధ్యానంవల్ల శరీర మనే బందిఖానా నుంచి తప్పించుకుని తిరిగి చిదాత్మగా తన నిజస్వరూపాన్ని తాలుస్తాడు (అధ్యాయం 26 చూడండి). మెదడులో “వెయ్యి రేకుల తామరపువ్వు” అని చెప్పే ఏడో కేంద్రం, అనంత చైతన్య రూపుడైన పరమాత్మ సింహాసనం. ఆధ్యాత్మిక జ్ఞానానుభవ స్థితిలో యోగి, బ్రహ్మను లేదా దేవుణ్ణి పద్మజుడిగా దర్శిస్తాడు; పద్మజుడంటే, “తామరపువ్వులో పుట్టినవాడని అర్థం.” “పద్మాసనం” అని అనడానికి కారణం, సాంప్రదాయికమైన ఆ ఆసనంలో యోగి, మేధోమేరుదండ కేంద్రం తాలూకు వివిధ వర్ణభాసితమైన పద్మాల్ని చూస్తాడు. ఒక్కొక్క పద్మానికి ఒక్కొక్క సంఖ్యలో, ప్రాణశక్తితో రూపొందిన రేకులు లేదా కిరణాలు ఉంటాయి. ఈ పద్మాల్ని చక్రాలు అని కూడా అంటారు.