పుట:Oka-Yogi-Atmakatha.pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

276

ఒక యోగి ఆత్మకథ

మేము ఆశ్రమం విడిచి బయటికి వచ్చామో లేదో, ఏదో ఇంద్రజాలం చేసినట్టుగా, ఆకాశమంతా మేఘాలతో నిండిపోతూ వచ్చింది. అన్నివైపులవాళ్ళూ ప్రకటించే ఆశ్చర్యానికి తోడు, నగర వీధుల్నీ మల మల మాడుతున్న సముద్రతీరాన్ని చల్లబరుస్తూ సన్న సన్నటి తుంపర పడింది.

రెండు గంటల ఊరేగింపు సమయంలో సేద దీర్చేటట్టుగా జల్లులు పడుతూనే ఉన్నాయి. మా బృందం ఆశ్రమానికి తిరిగివచ్చిన తక్షణమే మబ్బులూ వానా మటుమాయమయాయి.

“దేవుడు మనకోసం ఎంత ఇదవుతాడో చూడు!” అన్నారు గురుదేవులు, నేను కృతజ్ఞత తెలియజేసిన తరవాత. “ఈశ్వరుడు అందరికీ పలుకుతాడు; అందరికీ పనిచేస్తాడు. నా ప్రార్థననుబట్టి వాన కురిపించినట్టుగానే ఆయన, ఏ భక్తుడి హృదయాభిలాషనయినా సరే తీరుస్తాడు. దేవుడు తమ ప్రార్థనల్ని ఎంత తరచుగా మన్నిస్తాడో చాలా అరుదుగా గ్రహిస్తారు మనుషులు. ఆయన ఏ కొద్దిమంది మీదో పక్షపాతం చూపించడు; సంపూర్ణ విశ్వాసంతో తనని ఆశ్రయించిన వాళ్ళందరి ప్రార్థనలూ ఆలకిస్తాడు. సర్వాంతర్యామి అయిన తమ తండ్రి[1]కి గల ప్రేమతో కూడిన దయమీద ఆయన బిడ్డలకు అచంచల విశ్వాసం ఉండాలి.

శ్రీ యుక్తేశ్వర్‌గారు ఏడాదికి నాలుగు ఉత్సవాలు జరిపేవారు. విషువత్తులకూ సంక్రమణాలకూ. దూరంలోనూ దగ్గరలోనూ ఎక్కడెక్క

  1. “చెవి నిచ్చినవాడు వినడా? కన్ను కల్పించినవాడు చూడడా ?.... మనిషికి జ్ఞానం నేర్పేవాడు. తాను తెలుసుకోడా?” - సామ్స్ 94 : 9-10.