పుట:Oka-Yogi-Atmakatha.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

ఒక యోగి ఆత్మకథ

దృశ్య సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతట్లో, ఆ పొలంలో మాకు కొద్దిగజాల దూరంలోనే మా గురుదేవులు ప్రత్యక్షమయారు.”[1]

“భగవతిబాబూ, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు!” అన్నారాయన. ఆశ్చర్యచకితులమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయారో అంత విచిత్రంగానూ అదృశ్యమయ్యారు. నేను మోకరిల్లి, ‘లాహిరీ మహాశయా! లాహిరీ మహాశయా!’ అంటూ ఆశ్చర్యంలో ఆయన్ని స్మరించాను. మీ నాన్నగారు కొన్ని నిమిషాల సేపటివరకు అక్కడే స్తంభించుకుపోయారు.

“అవినాశ్ బాబూ! సెలవు నీ కివ్వడమే కాదు – నాక్కూడా నేను ఇచ్చుకుంటాను. రేపే బయల్దేరి కాశీ వెళ్దాం. నీ తరఫున చెప్పడంకోసం తమ సంకల్ప శక్తివల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మహాగురువులు--లాహిరీ మహాశయుల్ని గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి! మా ఆవిణ్ణి కూడా తీసుకువెళ్ళి, తమ ఆధ్యాత్మిక పంథాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన్ని అడుగుతాను. ఆయన దగ్గరికి తీసుకు వెళ్తావా?”

“తప్పకుండా.” నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకూ, పరిస్థితులు తొందరగా నా కనుకూలంగా మారినందుకూ ఆనందంలో మునిగి పోయాను.

“మర్నాడు సాయంకాలం మీ అమ్మగారూ, నాన్నగారూ, నేనూ కాశీ వెళ్ళడానికి బండి ఎక్కాం. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత

  1. మహామహులకుండే అద్భుత శక్తుల్ని గురించి అధ్యాయం 30 ‘అలౌకిక ఘటనల నియమం’ అన్నదాంట్లో వివరించడం జరిగింది.