పుట:Oka-Yogi-Atmakatha.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మా తల్లిదండ్రులు, నా బాల్యజీవితిం

9

“మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితిలో లాహిరీ మహాశయులకు శిష్యులయారో ఎప్పుడైనా విన్నావా?”

అది వేసవి కాలం; మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశ బాబూ నేనూ మా ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్నాం. అప్పుడీ చిక్కు ప్రశ్న వేశారాయన. ఏం చెబుతారో వినాలన్న ఆశతో, చిరునవ్వు నవ్వుతూ - తెలియదన్నట్టుగా తల తిప్పాను.

నువ్వింకా కొన్నేళ్ళకి పుడతావనగా, నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఓ వారం రోజులు సెలవిమ్మని, నా పై ఆఫీసరుగార్ని- అంటే మీ నాన్నగారిని అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారాయన.

“మతంలో పడి పిచ్చివాడివవుతున్నావా ఏమిటి?” అని అడిగారు. ‘నువ్వు కనక పైకి రాదలుచుకుంటే, ఆఫీసు పనిమీదే దృష్టి పెట్టుకో,’ అంటూ హితవు చెప్పారు.

“ఆ రోజు నేను విచారంగా ఇంటిమొహం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడిచిపోతూంటే, పల్లకీలో వస్తూ మీ నాన్న గారు కనిపించారు. బంట్రోతుల్నీ పల్లకీనీ వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. నన్ను ఓదార్చే ఉద్దేశంతో, లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలేమిటో చెప్పుకొచ్చారు. కానీ నేను దిగులుపడుతూనే ఉన్నాను. ‘లాహిరీ మహాశయా! మిమ్మల్ని చూడందే నేను బతకలేను,’ అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె, అదే పనిగా.

“ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడివిగడ్డికి కిరీటం పెట్టి నట్టుగా మెరుస్తున్నాయి సాయంకాలం సూర్యకిరణాలు. అద్భుతమైన ఆ