పుట:Oka-Yogi-Atmakatha.pdf/294

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

258

ఒక యోగి ఆత్మకథ

పరమేశ్వరుడి దివ్యశక్తి; అయినప్పటికీ ఆయన, స్పందనశీలమైన భౌతిక లోకాలకు ఆవల, ఆనందమయమైన అకల్పితశూన్యంలో సర్వోత్కృష్టంగా నిస్సంగుడై ఉంటాడు,"[1] అని వివరించారు. గురుదేవులు,

భూమి మీద ఆత్మసిద్ధి సాధించినవాళ్ళు అదే మాదిరి రెండు విధాల

  1. తండ్రి అయిన పరమాత్మ ఎవ్వరిగురించీ తీర్పు ఇవ్వడు; కాని తీర్పు ఇచ్చే పని అంతా తన ‘కుమారు’డికి అప్పగించాడు. – యోహాను 5 : 22. “మానవుడెవడూ ఏనాడూ దేవుణ్ణి చూడలేదు; కేవలం, జగత్పిత హృదయంలో ఉండే, ఆయన ఏకైక పుత్రుడు మాత్రం ఆయన్ని గురించి చాటి చెప్పాడు.” – యోహాను 1 : 16. “దేవుడు ఏసుక్రీస్తు ద్వారా అన్నిటినీ సృష్టించాడు.” – ఇఫేషియన్స్ 3 : 9. “నన్ను నమ్ముకొన్నవాడు కూడా నేను చేసే పనులన్నీ చేస్తాడు , నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను కాబట్టి అతడు ఇంతకన్న గొప్ప పనులు చేస్తాడు.” – యోహాను 14 : 12. “జగత్పిత నా పేరున పంపే సుఖప్రదుడైన పరిశుద్ధాత్మ మీకు అన్నిటినీ బోధిస్తాడు, నేను మీకు చెప్పినవాటి నన్నిటినీ ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు.” – యోహాను 14 : 36 (బైబిలు).

    బైబిలులో చెప్పిన ఈ మాటలు దేవుడి - త్రిరూపాత్మక ప్రకృతి అయిన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ (హిందువుల పవిత్ర గ్రంథంలో చెప్పిన సత్, తత్, ఓం) అన్న మూడింటినీ సూచిస్తాయి. జగత్పిత అయిన దేవుడు స్పందన శీలమయిన సృష్టికి అతీతంగా కేవల అవ్యక్తుడు. కుమారరూపుడైన దేవుడు స్పందన శీలమైన సృష్టికి ‘లోపల’ ఉండే క్రీస్తు చైతన్యం (బ్రహ్మ లేదా కూటస్థ చైతన్యం). ఈ క్రీస్తు చైతన్యమే ఎవరూ సృష్టించని అనంతస్వరూపుడి “ఏకైక సృష్టి” లేదా ఏకైక ప్రతిబింబం. సర్వవ్యాపకమైన క్రీస్తు చైతన్యం తాలూకు బాహ్యాభివ్యక్తి, దానికి “సాక్షి” (ప్రకటన 3 : 14) అయిన ఓంకారం, అంటే ‘శబ్దం’, లేదా ‘పరిశుద్ధాత్మ’ : ఇది అదృశ్య దివ్యశక్తి, ఏకైక కర్త, స్పందన ద్వారా సృష్టినంతనూ నిలిపే ఏకైక కారణశక్తి చాలనశక్తి. ఆనందమయమై సంప్రదాయమైన ఓంకారం ధ్యానంలో వినిపిస్తుంది; భక్తుడికి “అన్ని విషయాల్నీ జ్ఞాపకం” చేస్తూ, చరమ సత్యాన్ని వెల్లడిచేస్తుంది.