పుట:Oka-Yogi-Atmakatha.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నిద్రపోని సాధువు

245

ఎడమల తేడా పట్టించుకోని బాటసారిచేత నిన్ను తప్పుదారి పట్టించింది. ఈరోజు కూడా నీకు ఇబ్బంది తప్పలేదు!”

నేను మనఃపూర్తిగా ఒప్పుకున్నాను; నా ఎదురుగా కనిపిస్తున్న అతిసామర్థ్య శరీరంలో సర్వవ్యాపకమయిన కన్ను మరుగుపడి ఉన్నందుకు ఆశ్చర్యపోయాను. ఆ యోగి శరీరం నుంచి ఆరోగ్యప్రదమైన శక్తి ఒకటి వెలువడింది; ఎండ మలమలమాడుస్తున్న పొలంలో అప్పటికప్పుడు నాకు సేదదీరింది.

“దేవుణ్ణి తెలుసుకోడానికి తను పట్టిన దారి ఒక్కటి తప్ప మరేదీ లేదని అనుకోడానికే భక్తుడు మొగ్గు చూపిస్తాడు,” అన్నా రాయన. “మనకు లాహిరీ మహాశయులు చెప్పినట్టుగా, దివ్యత్వాన్ని లోపలే కనుక్కోగలిగేటట్టు చేసే యోగవిద్య అన్నిటికన్న ఉత్తమమైన మార్గమనడంలో సందేహం లేదు. కాని ఈశ్వరుణ్ణి లోపల కనిపెట్టిన తరవాత, త్వరలోనే బయట కూడా దర్శిస్తాం. తారకేశ్వర్‌లోనూ ఇతర చోట్లా ఉన్న పవిత్ర మందిరాల్ని ఆధ్యాత్మిక శక్తికి కేంద్రస్థానాలుగా మన్నిస్తూండడం సముచితమైన పని.”

ఆ సాధువుగారి మందలింపు ధోరణి మాయమైంది; ఆయన కళ్ళు కరుణతో ఆర్ద్రమయినాయి. ఆయన నా భుజం తట్టారు.

“యువకయోగీ, నువ్వు మీ గురువుగారి దగ్గిర్నించి పారిపోతున్నా వన్నది స్పష్టమవుతోంది. నీకు అవసరమయిందల్లా ఆయన దగ్గర ఉంది; నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాలి,” అని చెప్పి, “కొండలు నీకు గురువు కాలేవు,” అంటూ రెండు రోజుల కిందట శ్రీయుక్తేశ్వర్‌గారు వెల్లడించిన అభిప్రాయాన్నే ఈయనా వెల్లడించారు.

“కొండల మీదే ఉండాలన్న నిర్బంధం, విశ్వవిధానం ప్రకారం,