పుట:Oka-Yogi-Atmakatha.pdf/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

233

నిమగ్నులై నవాడికి, అమూల్యమైన ముత్యాలకోసం మౌనంగా లోపలికి మునగడానికి సమయం ఏముంటుంది?”

శ్రీయుక్తేశ్వర్‌గారు తమ శిష్యుల అధ్యయనాన్ని కూడా ఏకాగ్ర చిత్తంతో కూడిన అదే తీవ్రపద్ధతిలో సాగేటట్టు నడిపించేవారు. “జ్ఞానాన్ని ఒంటబట్టించుకునేది తనలో ఉన్న అణువణువుద్వారానే కాని కళ్ళతో కాదు,” అన్నారాయన. “ఒకానొక సత్యాన్ని గురించి నీలో ఉన్న ప్రగాఢ విశ్వాసం కేవలం నీ మెదడులో మాత్రమే కాక నీ అస్తిత్వమంతటా వ్యాప్తమై ఉన్ననాడు నువ్వు దాని అర్థాన్ని రూఢిపరచడానికి సంకోచిస్తావు.” ఆధ్యాత్మికసిద్ధికి పుస్తకపరిజ్ఞానాన్ని అవసరమైన ఒక మెట్టుగా పరిగణించవలసిన ధోరణి ఏది విద్యార్థిలో పొడగట్టకుండా నిరుత్సాహపరిచేవారు.

“ఋషులు ప్రగాఢమైన జ్ఞానాన్ని ఒక్కొక్క వాక్యంలో ఇమిడ్చి రాస్తే, విద్వాంసులు వాటిని వ్యాఖ్యానించడంలో తరతరాలుగా పూర్తిగా నిమగ్నులైఉన్నారు," అన్నారాయన. “అంతులేని సాహిత్య వివాదం మందబుద్ధులకే. ‘దేవుడున్నాడు’ అన్న చింతనకన్న కాదు, ‘దేవుడు’ గురించిన చింతనకన్న శీఘ్రంగా ముక్తిని ప్రసాదించేది మరొకటి ఏముంది?

కాని మానవుడు సరళతవేవు అంత సులభంగా మళ్ళడు. బుద్ధివాది “దేవుణ్ణి” ధ్యేయంగా పెట్టుకోడం అరుదు; అంతకన్న విద్యా సంబంధమైన ఆడంబరాల మీదే దృష్టి నిలుపుతాడు. తాను అటువంటి పాండిత్యం గడించగలిగినందుకు అతని అహం సంతుష్టి చెందుతుంది.

లౌకికమైన తమ హోదానుకాని సంపత్తినికాని సగర్వంగా, స్పృహలో ఉంచుకొన్నవాళ్ళు, మా గురుదేవుల సాన్నిధ్యంలో, తమకు ఉన్న వాటికితోడు వినయాన్ని కూడా చేర్చుకోడం సంభవం. ఒకసారి,