పుట:Oka-Yogi-Atmakatha.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

218

ఒక యోగి ఆత్మకథ

దురవగాహంగా ఉండగా సాధువుల అగాధమైన ప్రకృతి ఒక్కటి తక్షణమే అర్థంకావాలని అడగడానికి సాహసించవచ్చా?

శిష్యులు వచ్చేవారు; సాధారణంగా వెళ్ళిపోయేవారు. సులువైన దారికోసం – అంటే, తక్షణ సానుభూతికోసం, తన యోగ్యతలకు ఆహ్లాదకరమైన గుర్తింపుకోసం – తపించిపోయే వాళ్ళకి ఈ ఆశ్రమంలో అది కనిపించేది కాదు. గురుదేవులు తమ శిష్యులకు ఆశ్రయం, అనేక యుగాల పాటు సంరక్షణ ఇస్తూండేవారు. కాని చాలామంది శిష్యులు లోభుల మాదిరిగా తమ అహంకారానికి తృప్తి కూడా కావాలని కోరేవారు. వినయం అలవరచుకోడానికి బదులుగా జీవితంలో ఎదురయే లెక్కలేనన్ని అవమానాలకే ప్రాముఖ్యమిచ్చి వెళ్ళిపోయారు వాళ్ళు. శ్రీయుక్తేశ్వర్‌గారి తీక్ష్ణకిరణాలు – అంటే, బహిరంగంగా లోపలికి చొచ్చుకు వెళ్ళే ఆయన జ్ఞాన సూర్యరశ్మి – వాళ్ళ ఆధ్యాత్మిక రుగ్మతకు భరించజాలనంత శక్తిమంతమైనవి. వాళ్ళు తమను పొగడ్తతో మరుగుపరుస్తూ అజ్ఞానమనే కలతనిద్రలో ఉండనిచ్చే తక్కువస్థాయి గురువును చూసుకునేవారు.

గురుదేవుల దగ్గర నేనున్న తొలినాళ్ళలో, పదిమంది ముందు ఆయన పెట్టే చివాట్లంటే ఒక రకం భయం పట్టుకుంది. అయితే ఆయన, మాటల రూపంలో చేసే ఆ శస్త్రచికిత్సలు, తర్ఫీదు ఇమ్మని నా మాదిరిగా తమను కోరిన వ్యక్తులమీదే ప్రయోగించేవారని త్వరలోనే గ్రహించాను. అందుకు గింజుకునే విద్యార్థి ఎవరయినా అభ్యంతరం చెబితే మట్టుకు శ్రీయుక్తేశ్వర్‌గారు, మనస్సులో ఏమీ నొచ్చుకోకుండా మౌనం వహించేవారు. ఆయన మాటలెన్నడూ, వ్యక్తిగతంగా వర్తించేటట్లు, కాకుండా జ్ఞానసంపన్నమై ఉండేవికాని, ఆగ్రహోదగ్రంగా ఉండేవి కావు.

గురుదేవుల చివాట్లు ఉత్తిపుణ్యానికి వచ్చినవాళ్ళకి ఎన్నడూ తగి