పుట:Oka-Yogi-Atmakatha.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

215

విద్యార్థుల అభిమానాన్ని ఆయన చూరగొనలేదు. ఎప్పుడూ కొద్ది సంఖ్యలోనే ఉండే తెలివైన విద్యార్థులు మాత్రం ఆయన్ని ప్రగాఢమైన భక్తితో ఆరాధించేవారు.

ఆయన మాట అంత కటువుగానూ నిందాత్మకంగానూ ఉండి ఉండకపోతే భారతదేశంలో ఎక్కువమంది శిష్యులు వెతుక్కుంటూ ఏరి కోరి వచ్చేది శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గరికేనని నొక్కి చెప్పగలను.

“నా దగ్గరికి తర్ఫీదుకు వచ్చిన వాళ్ళ విషయంలో నేను కఠినంగా ఉంటాను,” అని నా దగ్గర ఒప్పుకొన్నారాయన. “అది నా పద్ధతి. దాన్ని, ఒప్పుకో, మానుకో; అందులో నేను రాజీపడను. కాని నువ్వు నీ శిష్యులతో ఇంతకంటె దయగా ఉంటావు. అది నీ పద్ధతి. కాఠిన్యమనే నిప్పుల్లోనే కాల్చి శుద్ధి చెయ్యడానికి ప్రయత్నిస్తాను నేను! ఇవి, సగటు సహనశక్తి కి మించి మలమల మాడుస్తాయి. ప్రేమతో కూడిన సౌమ్య మార్గం కూడా మార్పు తీసుకువస్తుంది. విజ్ఞతతో ప్రయోగించినట్టయితే కఠోర పద్ధతులూ కోమల పద్ధతులు కూడా సమంగా ఫలప్రదమైనవే.” ఆయన ఇంకా ఇలా అన్నారు, “నువ్వు పై దేశాలకి వెళ్తావు; అక్కడ అహంకారం మీద మొరటుగా తీసే దెబ్బల్ని హర్షించరు. రాజీపడడానికి అనుకూలమైన నిధానం, ఓరిమి సమృద్ధిగా లేనిదే ఏ గురువూ భారతదేశ సందేశాన్ని పాశ్చాత్యదేశాల్లో వ్యాప్తి చెయ్యలేడు.” (గురుదేవుల మాటల్ని నేను అమెరికాలో ఎంత తరచుగా గుర్తు చేసుకున్నానో చెప్పనుగాక చెప్పను!). వాస్తవాన్ని బయల్పరిచే మా గురుదేవుల వాక్కు, ఆయన భూమిమీద ఉన్న కాలంలో అధిక సంఖ్యలో శిష్యులు ఏర్పడకుండా ఆటంకపరిచినప్పటికీ, నానాటికీ అధికమవుతున్న, చిత్తశుద్ధిగల శిష్యుల మూలంగా ఆయన ఆత్మ ఈనాటికీ ప్రపంచంలో జీవిస్తోంది. అలెగ్జాండరు వంటి యోధులు భూమిమీద సార్వభౌమాధికారం కోసం పాకులాడుతారు;