పుట:Oka-Yogi-Atmakatha.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

211

చాలి,” అవి వాళ్ళకు చెప్పేవారాయన. “శరీర యంత్రానికి సరిగా వెనకాల సూక్ష్మమైన ఆధ్యాత్మిక తంత్రం ఒకటి దాక్కొని ఉంది.[1]

శ్రీ యుక్తేశ్వర్‌గారు తమ శిష్యుల్ని, ప్రాచ్య పాశ్చాత్యదేశాల సుగుణాల్ని ఇముడ్చుకొన్న జీవంతమైన మేళనకర్తలుగా నడుచుకోమని సలహా ఇచ్చేవారు. ఆయనయితే బాహ్యమైన అలవాట్లతో పాశ్చాత్యఫక్కి నిర్వాహకులు; అంతరంగంలో ప్రాచ్యఫక్కి ఆధ్యాత్మిక వాది. పాశ్చాత్యుల అభ్యుదయశీలక, ప్రతిభాసంపన్న, ఆరోగ్యప్రదమైన పంథాలనూ అనేక శతాబ్దుల కాలంగా ప్రాచ్యదేశాల ఘనత నిలిపిన ధార్మిక ఆదర్శాలనూ ప్రశంసించేవారాయన.

క్రమశిక్షణ నాకు తెలియనిది కాదు; ఇంటి దగ్గర నాన్న గారు

  1. శరీర ధర్మశాస్త్రంలో నోబెల్ బహుమానం పొందిన, సాహసవంతుడైన వైద్యశాస్త్రజ్ఞుడు ఛార్లెస్ రాబర్ట్ రిషే ఇలా రాశాడు: “అధిభౌతికశాస్త్రం ఇంతవరకు ఒక శాస్త్రంగా అధికారికంగా గుర్తింపు పొందలేదు. అయినా ఇక ముందు పొందుతుంది... మనకు ఇంద్రియ జ్ఞానమిచ్చేవి కేవలం ఐదు జ్ఞానేంద్రియాలు మట్టుకే కాదనీ, ఇతర మార్గాల్లో కూడా ఒక్కొక్కప్పుడు, వాస్తవికతా శకలం ఒకటి తెలివిని చేరుతూ ఉంటుందనీ నేను, ఎడిన్‌బర్గ్‌లో 100 మంది శరీర ధర్మశాస్త్రజ్ఞుల ఎదుట నొక్కి చెప్పగలిగాను. ...ఒక యథార్ధం అరుదు అయినంత మాత్రాన అది ఉండదని చెప్పడం ఒక హేతువు కాదు. ఒక విషయాన్ని అధ్యయనం చెయ్యడం కష్టమయినంత మాత్రాన, దాన్ని అర్థంచేసుకోకపోవడాని కది కారణమవుతుందా?... చింతామణి కోసం వెతకడం భ్రాంతి మూలకమన్న హేతువుతో రసాయనశాస్త్రాన్ని ఈసడించే వాళ్ళ మాదిరిగానే అధిభౌతికశాస్త్రాన్ని గుహ్యవిద్యగా ఈసడించేవాళ్ళు కూడా తమ తెలివితక్కువ తనానికి తాము సిగ్గుపడతారు... శాస్త్రనియమాల విషయంలో లావోజియర్, క్లాడ్ బెర్నార్డ్, పాశ్చర్ అన్న వాళ్ళవే ఉన్నాయి; వాళ్ళు సర్వత్ర, సర్వదా ‘ప్రయోగశీలులు’. అందుచేత మానవ చింతనలో పరివర్తన తీసుకురాబోయే ఈ నవీన శాస్త్రానికి స్వాగతం పలుకుతున్నాను. "