పుట:Oka-Yogi-Atmakatha.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

210

ఒక యోగి ఆత్మకథ

నవ్వుతూ మా గురుదేవులు, “కుక్కకి ఒక ఎముక వెయ్యగూడదూ?”[1] అన్నారొకసారి.

శ్రీ యుక్తేశ్వర్‌గారి ఆరోగ్యం అద్భుతంగా ఉండేది. ఆయనకు సుస్తీ చెయ్యగా ఎన్నడూ చూడలేదు నేను.[2] తమ శిష్యులు వైద్యుల్ని సంప్రదించదలిస్తే, లౌకికాచారాన్ని మన్నించడం కోసం ఆయన, వాళ్ళకు అందుకు అనుమతి ఇచ్చేవారు. “భౌతిక పదార్థానికి వర్తించే విధంగా దేవుడు ఏర్పరిచిన నియమాల ద్వారా వైద్యులు తాము చేసే వైద్యం సాగించాలి,” అనే వారాయన. అయితే మానసిన వైద్యానికున్న ఘనతను ప్రశంసిస్తూ ఆయన, తరచుగా ఇలా అనేవారు: “అన్నిటికన్న గొప్పగా క్షాళన చేసేది జ్ఞానం.” ఆయన శిష్యులకు ఇలా చెప్పారు:

“విశ్వాసఘాతుకుడైన స్నేహితుడిలాంటిది శరీరం. దానికి ఇయ్యవలసినంత మట్టుకే ఇయ్యండి; అంతకు మించి వద్దు. కష్టం, సుఖం అనేవి అస్థిరమైనవి. ఈ ద్వంద్వాల ప్రాబల్యం నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తూనే వాటి నన్నిటినీ నిబ్బరంగా ఓర్చుకోండి. జబ్బూ స్వస్థతా కూడా ప్రవేశించే ద్వారం ఊహ. మీకు జబ్బుగా ఉన్నప్పుడయినా సరే, జబ్బు అనే వాస్తవాన్ని నమ్మకండి; గుర్తింపు పొందని ఆ సందర్శకుడు పలాయనం చిత్తగిస్తాడు!”

మా గురువుగారి శిష్యుల్లో వైద్యులు చాలామంది ఉన్నారు. “శరీర ధర్మశాస్త్రం చదివినవాళ్ళు ఇంకా ముందుకు సాగి ఆత్మజ్ఞానాన్ని శోధిం

  1. ఉపవాసమనేది ఆదర్శవంతమైన సహజ క్షాళన పద్ధతి అని మా గురుదేవులు ఆమోదించారు; కాని ప్రత్యేకించి ఈ శిష్యుడికి మాత్రం ఒంటిమీద ధ్యాస ఎక్కువ.
  2. నేను ఆయన దగ్గర లేనప్పుడు ఒకసారి కాశ్మీరులో ఆయన జబ్బు పడ్డారు (21 అధ్యాయం చివర చూడండి).