పుట:Oka-Yogi-Atmakatha.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

207

లుగా జన్మించినప్పటికీ దేశకాలాలకు నియంత అయిన పరమేశ్వరుడితో తాదాత్మ్యం సాధించారు. నరుడు నారాయణుడు కావడానికి దాటరాని అడ్డంకి ఏదీ ఆయనకు అవుపించలేదు. మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప, వేరే అడ్డంకి ఏది లేదని నేను క్రమంగా గ్రహించాను.

శ్రీ యుక్తేశ్వర్‌గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నాకు ఒళ్ళు పులకిస్తుండేది. గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడంవల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణశక్తి పొందుతాడు; సూక్ష్మ విద్యుత్ప్రవాహం ఒకటి జనిస్తుంది. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుదాఘాతం పొందుతాయి. అతని ప్రాపంచిక ప్రవృత్తుల గాళ్ళు చెదిరి లాభకరమవుతాయి. కనీసం క్షణికంగానయినా, మాయను కప్పి ఉన్న రహస్య ఆచ్ఛాదనం తొలగడం, పరమానందమనే వాస్తవికత తళుక్కుమనడం జరగవచ్చు. నేను భారతీయపద్ధతిలో మా గురుదేవులకు ఎప్పుడు ప్రణామం చేసినా, నా శరీరమంతటా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది.

“లాహిరీ మహాశయులు మౌనంగా ఉన్నప్పుడు సైతం, లేదా కచ్చితంగా మతానికి సంబంధించని విషయాలు ముచ్చటించేటప్పుడు కూడా వారు అనిర్వచనీయమైన విజ్ఞానం అందిస్తున్నారని కనిపెట్టేవాణ్ణి,” అన్నారు గురువుగారు నాతో.

ఆ విధంగానే శ్రీ యుక్తేశ్వర్‌గారు నన్ను ప్రభావితుణ్ణి చేశారు. నేను దిగులుగాగాని ఉదాసీనమైన మనస్సుతోకాని ఆశ్రమంలోకి ప్రవేశిస్తే నా వైఖరి తెలియకుండానే మారిపోయేది. కేవలం మా గురుదేవుల దర్శనంతోనే ఉపశమనం కలిగించే ప్రశాంతత నాకు లభించేది. ఆయన సన్నిధిలో ప్రతిరోజూ ఆనందంతో, శాంతిలో, జ్ఞానంలో ఒక్కొక్క కొత్త అనుభవం కలుగుతుండేది. దురాశవల్లనో కోపంవల్లనో మానవిక