పుట:Oka-Yogi-Atmakatha.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

197

“గురూజీ, క్రూర జంతువును చంపడానికి బదులు, తాను బలికావడానికి సిద్ధం కావాలా?”

“అక్కర్లేదు. మానవదేహం అమూల్యమైనది. విలక్షణమైన మెదడూ వెన్నులో షట్చక్రాలూ ఉన్న కారణంగా దానికి, పరిణామాత్మక మైన విలువ అన్నిటికన్న ఎక్కువ ఉంది. ఉన్నత స్థితి నందుకొన్న భక్తుడు పరమేశ్వరుడి సర్వోన్నత స్వరూప రీతులను సంపూర్ణంగా అవగాహన చేసుకోడానికి అభివ్యక్తీకరించడానికి సామర్థ్యం కలిగిస్తాయి ఇవి. అంతకన్న తక్కువరకం జీవికి దేనికీ అటువంటి సదుపాయం సమకూరలేదు. ఒక వ్యక్తి ఒక జంతువునుకాని, మరే జీవినయినాకాని తప్పనిసరిగా చంపవలసి వచ్చినట్లయితే అతడు స్వల్పమైన పాపానికి ఒడిగట్టవలసి వస్తుందన్నది నిజమే. కాని నిష్ప్రయోజనంగా మానవదేహ నాశం కావించడం కర్మసిద్ధాంత నియమాన్ని తీవ్రంగా ఉల్లంఘించినట్లేనని ధర్మశాస్త్రాలు ఘోషిస్తాయి.”

మనస్సు తేలికపడి నిట్టూర్చాను; మనిషికి పుట్టుకతో వచ్చిన సహజాతాల్ని ధర్మశాస్త్రాలు అన్ని సమయాల్లోనూ బలపరచవు.

నాకు తెలిసినంతవరకు గురువుగారు, చిరుతపులికికాని పులికికాని ఎన్నడూ ఎదురుపడలేదు. అయితే ఒకసారి, భయంకరమైన నాగుబాము ఒకటి ఆయన ఎదుటికి వచ్చిందికాని, ఆయన ప్రేమకు వశమైపోయిందది. ఈ సంఘటన పూరీలో, సముద్రపు ఒడ్డున మా గురువుగారికున్న ఆశ్రమం దగ్గర జరిగింది. శ్రీ యుక్తేశ్వర్‌గారి దగ్గర కడపటి కాలంలో శిష్యరికం చేసిన ప్రపుల్లుడనే కుర్రవాడు ఆ సమయంలో ఆయన దగ్గర ఉన్నాడు.

“మేము ఆశ్రమం దగ్గర ఆరుబయట కూర్చుని ఉన్నాం,” అంటూ చెప్పాడు ప్రఫుల్లుడు. “దగ్గరిలో ఒక నాగుబాము కనిపించింది. చూస్తేనే వణుకు పుట్టేటంత భయంకరమైన ఆ పాము నాలుగడుగుల పొడుగుంది.