పుట:Oka-Yogi-Atmakatha.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

195

కానికి గురువుగారు అంగీకరించింది నన్ను సంతోష పెట్టడానికే నన్నసంగతి గ్రహించాను; ఆయనకు దోమల భయం లేదు. యోగశక్తి వల్ల ఆయన, దోమలు తమను కుట్టకుండా ఆపగలరు, లేకపోతే, ఆయన తలుచుకుంటే, అంతరికంగా అభేద్యులై ఉండగలరు.

“ఆయన నాకోసం ఇది ప్రదర్శించారు. నేను కృషిచేసి సాధించవలసిన యోగస్థితి అది,” అనుకున్నాను. నిజమైన యోగి, అధిచేతన స్థితిలోకి ప్రవేశించి, దాన్ని నిలుపుకొనే సామర్థ్యం కలవాడు. కీటకాల రొద, కళ్ళు మిరుమిట్లు గొలిపే పగటి వెలుతురు వంటివి అసంఖ్యాకంగా మన మనస్సును చికాకుపరుస్తాయి; ఈ భూమి మీద - అవి లేకపోవడ మన్నది ఎన్నడూ లేదు. నిజమైన యోగి, వాటిని లెక్క పెట్టడు. సమాధిలోని ప్రథమావస్థలో (సవికల్పస్థితి) యోగి, బాహ్య ప్రపంచపు ఇంద్రియ బోధలన్నిటినీ అటకాయించేస్తాడు. అప్పుడు ఆయనకు బహూకృతిగా, తొలుతటి ఈడెన్ స్వర్గం[1] కంటె కూడా సుందరమైన అంతర్లోకాల నాదాలు వినిపిస్తాయి; దృశ్యాలు కనిపిస్తాయి.

గుణపాఠం నేర్పగల ఈ దోమలు, నేను ఆశ్రమంలో మరో ఆరంభపాఠం నేర్చుకోడానికి ఉపకరించాయి. అది ప్రశాంతమైన సాయం సంధ్య వేళ. మా గురుదేవులు ప్రాచీన పవిత్ర గ్రంథాల్ని గురించి సాటిలేని రీతిగా వ్యాఖ్యానం చేస్తున్నారు. ఆయన పాద సన్నిధిలో పరిపూర్ణమైన ప్రశాంతిని అనుభవిస్తున్నాను నేను. మొరటు దోమ ఒకటి, రమణీయ

  1. యోగి తన జ్ఞానేంద్రియాల్ని ఉపయోగించకుండానే చూడడం, రుచి చూడటం, వాసన గ్రహించడం, తాకడం, వినడం అన్నవి చెయ్యడానికి అతనికి సామర్థ్యం కలిగించే సర్వవ్యాపక శక్తుల్ని గురించి “తైత్తిరీయ అరణ్యకం” లో ఇలా వర్ణించటం జరిగింది: “గుడ్డివాడు ముత్యానికి చిల్లి పొడిచాడు; వేళ్ళు లేనివాడు దాంట్లోకి దారం ఎక్కించాడు; మెడలేనివాడు దాన్ని ధరించాడు; నాలికలేని వాడు దాన్ని పొగిడాడు.”