పుట:Oka-Yogi-Atmakatha.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం

189

నేను మళ్ళీ చదువుకొనసాగిస్తానని నాన్న గారు సంతోషించారు. దానికి తగిన ఏర్పాట్లు చేశారాయన. ఆ మర్నాడు నేను, కలకత్తాలో ఉన్న స్కాటిష్ చర్చ్ కాలేజిలో ప్రవేశించాను.

నెలలకు నెలలు సంతోషదాయకంగా వడివడిగా గడిచాయి. నేను కాలేజి తరగతి గదుల్లో బొత్తిగా కనిపించి ఉండనని సూక్ష్మగ్రాహులైన పాఠకులు ఈపాటికి అనుమానించి ఉంటారనడంలో సందేహం లేదు. శ్రీరాంపూర్ ఆశ్రమం ఆకర్షణ నాకు నిగ్రహించుకోజాలని దయింది. నేమ నిరంతరం అక్కడే ఉంటున్నందుకు గురుదేవులు ఏమీ వ్యాఖ్య చెయ్యకుండా నా ఉనికిని అంగీకరించారు. ఆయన విద్యాలయాలగురించి ప్రస్తావించడం సకృతు కావడంవల్ల నా మనస్సు తేలికపడింది. నేను విద్వాంసుడిగా తయారవడానికి మలిచినవాణ్ణి కానన్న సంగతి స్పష్టమే అయినప్పటికీ సమయానుగుణంగా కనీసపు పాస్ మార్కులు తెచ్చుకోగలుగుతూ ఉండేవాణ్ణి.

ఆశ్రమంలో నిత్యజీవితం సాఫీగా సాగిపోయింది; దాంట్లో మార్పు ఎప్పుడోకాని వచ్చేది కాదు. మా గురుదేవులు వేకువవేళకు ముందే నిద్ర లేచేవారు. పక్క మీద పడుక్కొని ఉండిగాని, ఒక్కొక్కప్పుడు కూర్చొని ఉండిగాని సమాధి[1] స్థితిలోకి వెళ్ళేవారు. గురుదేవులు మేల్కొన్నారన్న సంగతి ఇట్టే తెలిసిపోయేది; పెద్దగా ఆయన పెట్టే గుర్రు[2]- చటుక్కున ఆగిపోయేది. ఒకటి రెండు నిట్టూర్పులు; బహుశా శారీరకమైన కదలిక.

  1. వాచ్యార్థం, “కలపడం; మనస్సును ధ్యేయ వస్తువులో లయం చేయడం” అని. ‘సమాధి’ అనేది పరమానందమయమైన అధిచేతన స్థితి. ఈ స్థితిలో యోగి, జీవాత్మపరమాత్మల ఐక్యానుభూతి పొందుతాడు.
  2. గుర్రుపెట్టడమన్నది, సంపూర్ణమైన విశ్రాంతి పొందినట్టుగా సూచన అని శరీరధర్మ శాస్త్రజ్ఞుల అభిప్రాయం