పుట:Oka-Yogi-Atmakatha.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు బృందావనంలో

181

అద్భుతంగా ఉన్నాయి. గోధుమ, ఊదారంగుల పాలరాళ్ళలోంచి సున్నితమైన పూలగుత్తులు, కాయితం చుట్టల్లాంటివి బయటికి వస్తున్నట్టుగా చెక్కడం జరిగింది. గుమ్మటంనుంచి వచ్చే దీపకాంతి షాజహాన్ చక్రవర్తి సమాధి మీదా, ఆయన రాజ్యానికి హృదయానికి కూడా రాణి అయిన ముంతాజ్-ఇ-మహల్ సమాధి మీదా ప్రసరిస్తోంది.

దృశ్యాలు చూడటం ఇక చాలు! నేను నా గురువుగారికోసం తహ తహలాడుతున్నాను. కాసేపటికి నేనూ జితేంద్రుడూ దక్షిణదిశగా బెంగాల్ వేపు సాగే రైల్లో ప్రయాణం చేస్తున్నాం.

“ముకుందా, కొన్ని నెలలుగా నేను మావాళ్ళని చూడలేదు. నా మనస్సు మార్చుకున్నాను, బహుశా తరవాత ఎప్పుడో నేను శ్రీరాంపూర్‌లో మీ గురువుగారి దర్శనం చేసుకుంటాను.

కొంచెం సున్నితంగా చెప్పాలంటే, ఊగిసలాట మనస్తత్వం గల నా స్నేహితుడు నన్ను కలకత్తాలో వదిలి పెట్టి పోయాడు. నేను లోకల్ ట్రెయిన్‌లో, ఉత్తరదిశగా పన్నెండు మైళ్ళ దూరంలో ఉన్న శ్రీరాంపూర్ వెళ్ళాను.

కాశీలో గురువుగారిని కలిసి అప్పటికి సరిగా, ఇరవై ఎనిమిది రోజులయిందన్న సంగతి గ్రహించేసరికి ఆశ్చర్యం వేసింది. “నువ్వు నాలుగు వారాల్లో వస్తావు నా దగ్గరికి!”, ప్రశాంతంగా ఉన్న రాయ్‌ఘాట్ సందులో వారి ఆశ్రమం ముంగిట్లో అడుగుపెట్టాను. గుండె దడదడలాడుతోంది. భారతదేశపు జ్ఞానావతారుల సన్నిధిలో, తరవాతి పదేళ్ళలో మంచి రోజులని చెప్పదగ్గకాలం గడపడానికి నేను మొట్టమొదటి సారిగా ఆ ఆశ్రమంలో అడుగుపెట్టాను.