పుట:Oka-Yogi-Atmakatha.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

176

ఒక యోగి ఆత్మకథ

“ఇప్పుడు నీ కడుపు నిండింది కనక, దేవుణ్ణి ఇట్టే మరిచిపోయావు,” నా మాటలు కటువుగా అయితే లేవుగాని నింద మోపుతున్నట్టుగా ఉన్నాయి. దేవుడి దయను మనుషులు ఎంత తొందరగా మరిచిపోతారు! తన ప్రార్థనల్లో కొన్నయినా ఫలించగా చూడని మనిషంటూ ఉండడు.”

“నీలాంటి పిచ్చివాడితో కలిసి రావడం ఎంత బుద్ధితక్కువో నేను మరిచిపోను!”

“నిబ్బరంగా ఉండు జితేంద్రా! మనకు తిండి పెట్టిన ఆ భగవంతుడే బృందావనం చూపించి ఆగ్రాకు తిరిగి పంపిస్తాడు.”

ముచ్చట గొలిపే ముఖ కవళికలుగల సన్నటి యువకు డొకడు గబ గబా నడుస్తూ మా దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గర ఆగిపోయి, నా ముందు వంగి నమస్కరించాడు.

“ప్రియమిత్రమా, మీరూ మీ స్నేహితుడూ ఈ ఊరికి కొత్త అయి ఉండాలి. మీకు ఆతిథ్యం ఇవ్వడానికి ఊరు చూపించడానికి నాకు అనుమతి ఇవ్వండి.”

భారతీయుడి ముఖం పాలిపోవడమన్నది చాలా అరుదు; కాని జితేంద్రుడి ముఖంలో కత్తివాటుకు నెత్తుటి చుక్క లేదు. అతను చెయ్యదలిచిన సహాయాన్ని నేమ మర్యాదగా తిరస్కరించాను.

“మీరు నన్ను నిజంగా వెళ్ళగొట్టడం లేదు కదూ?” మరే పరిస్థితిలోనో అయితే ఆ అపరిచితుడి వ్యాకులతకు మాకు నవ్వు వచ్చి ఉండేది.

“ఎందుక్కాదు?”

“మీరు నా గురువులు.” విశ్వాసాన్ని నింపుకొన్న అతని కళ్ళు నా కళ్ళలోకి చూశాయి. మధ్యాహ్నం ధ్యానంచేసుకొనే వేళ, శ్రీకృష్ణ