పుట:Oka-Yogi-Atmakatha.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు బృందావనంలో

173

“అబ్బాయిలూ, బృందావనంలో మీ కెవరయినా స్నేహితులున్నారా?” నా ఎదురుగా కూర్చున్న అపరిచితవ్యక్తి, మా విషయంలో ఆసక్తి తీసుకుని మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు.

“మీ కనవసరం!” మొరటుగా నా కళ్ళు తిప్పేశాను.

“బహుశా మీరు, ఆ చిత్తచోరుడి[1] మోహంలో పడి ఇళ్ళనుంచి పారిపోతున్నారనుకుంటాను. నా మట్టుకు నేనూ భక్తిభావం గలవాణ్ణే. అంచేత మీకు భోజనమూ ఎండకు మలమల మాడకుండా వసతీ సమకూరేటట్టు చూడడం నా అనివార్య కర్తవ్యంగా భావిస్తాను.”

“వద్దండి. మమ్మల్ని వదిలెయ్యండి; మీరు చాలా దయగలవారు కాని మేము ఆగమ్మకాకులమని అనుకోడంలో మట్టుకు పొరపడ్డారు.”

అటుతరవాత సంభాషణ ఏమీ జరగలేదు; బండి అడంగుకు చేరి ఆగింది. నేనూ జితేంద్రా ప్లాట్‌ఫారం మీదికి దిగేసరికి మా తోటి ప్రయాణికులు మా ఇద్దరి చేతులు పట్టుకొని ఒక గుర్రబ్బండిని పిలిచారు.

మేము ఒక పెద్ద ఆశ్రమం ముందు బండి దిగాం. ఆ ఆశ్రమం, చక్కగా తీర్చిదిద్దిన ఆవరణలో పచ్చని చెట్లమధ్య అలరారుతోంది. మా ఉపకారులు ఇక్కడివారికి తెలిసినవాళ్ళేనని స్పష్టమయింది; చిరునవ్వు చిందిస్తున్న కుర్రవాడొకడు ఏమీ వ్యాఖ్యానించకుండా మమ్మల్ని ఒక సావిట్లోకి తీసుకువెళ్ళాడు. కాసేపట్లో, హుందాతనం ఉట్టిపడుతున్న ఒక వృద్ధురాలు వచ్చి మమ్మల్ని కలుసుకున్నారు.

“గౌరీ మా, యువరాజులు రాలేకపోయారు. వారిలో ఒకరు ఆశ్రమ అతిథేయినితో అన్నారు “చివరి క్షణంలో, వాళ్ళ కార్యక్రమాలు మారిపోయాయి. అందుకు ఎంతో విచారం వెలిబుచ్చారు. అయినా మేము

  1. హరి; భక్తులకు ప్రియమైన శ్రీకృష్ణుడి పేరు.