పుట:Oka-Yogi-Atmakatha.pdf/192

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు బృందావనంలో

171

అన్నాడు: “నువ్వుకూడా తోడు వెళ్ళాలి – ఇందుకు సాక్షిగానూ, బహుశా తోడుగా బాధలకు గురికావడానికినూ!”

తరవాత ఒక అరగంటలో నాకూ జితేంద్రకీ, ఒకవైపు ప్రయాణానికి టిక్కెట్లు చేతికి వచ్చాయి. స్టేషనులో ఒక మూల మమ్మల్ని తనిఖీ చేసుకోడానికి అవకాశం ఇచ్చాం. మే మెక్కడా దాపరికంగా డబ్బు తీసుకువెళ్ళడం లేదని తొందరగానే తృప్తిపడ్డాడు అనంతుడు; మా సాదా పంచెలు అవసరమైన వాటిని తప్ప మరేమీ మరుగుపరచలేదు.

దేవుడి మీది విశ్వాసం, డబ్బులాంటి గంభీరమైన విషయాల మీద దాడి చేసేసరికి మా స్నేహితుడు ఆక్షేపణ తెలుపుతూ ఇలా అన్నాడు. “అనంతా, కాపుదల కోసం ఒకటి రెండు రూపాయలియ్యి నాకు. దురదృష్టం ఎదురయితే అప్పుడు నీకు టెలిగ్రాం ఇయ్యగలుగుతాను.”

“జితేంద్రా!” నా నోట్లోంచి వచ్చిన మాట, కటువుగా మందలింపులా ఉంది.

“చివరి కాపుదలకోసం నువ్వేమయినా డబ్బు తీసుకునేటట్టయితే ఈ పరీక్షకు నేను రాను!”

“డబ్బుల గలగలలో ఏదో భరోసా ఉంటుంది.” నేను కఠినంగా హెచ్చరించేసరికి జితేంద్రుడు ఇంతకుమీంచి ఏమీ అనలేదు.

“ముకుందా, నేను హృదయంలేనివాణ్ణి కాను.” అనంతుడి గొంతులోకి మార్దవం చొరబడింది. అతన్ని బహుశా అంతరాత్మ మందలిస్తున్నట్టుంది – చేతిలో పైసలేని కుర్రవాళ్ళ నిద్దరిని పరిచయంలేని పట్నానికి పంపుతున్నందువల్ల కావచ్చు; మతపరంగా తనకున్న సంశయశీలతవల్ల నైనా కావచ్చు. “అదృష్టవశాత్తు నువ్వు ఈ బృందావన పరీక్షలో కనక నెగ్గితే నన్ను నీ శిష్యుడిగా స్వీకరించి ఉపదేశమిమ్మని అడుగుతాను.”