పుట:Oka-Yogi-Atmakatha.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

166

ఒక యోగి ఆత్మకథ

దానికి తగ్గంత పని చెయ్యనే చెయ్యడు. ఈ వ్యాఖ్యానం చాటునుంచి విని నా డబ్బు నాన్నగారికి తిప్పి పంపెయ్యమన్న సలహా పాటించినందుకు మొట్టమొదటి సారిగా విచారించాను. గుండె బరువెక్కి పోవడంతో నాకున్న ఒకే ఒక స్నేహితుడు – జితేంద్ర దగ్గరికి వెళ్ళాను.

“నేను వెళ్ళిపోతున్నాను. దయానందులు తిరిగి వచ్చిన తరవాత ఆయనకి నా క్షమాపణలు తెలియుజెయ్యి.”

“నేనూ వచ్చేస్తాను. ఇక్కడ ధ్యానంచేసుకోడానికి నేను చేసే ప్రయత్నాలన్నీ నీ వాటికి మించి ఫలించడం లేదు.” జితేంద్రుడు దృఢనిశ్చయంతో అన్నాడు.

“ఈమధ్య నేను క్రీస్తులాటి యోగీశ్వరుల్ని కలుసుకున్నాను- శ్రీరాంపూర్‌లో ఆయన దర్శనం చేసుకుందాం.”

ఈ విధంగా “పక్షి”, ప్రమాదకరమైన రీతిలో కలకత్తాకి దగ్గరలో “దిగడానికి” తయారయింది.