పుట:Oka-Yogi-Atmakatha.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

158

ఒక యోగి ఆత్మకథ

“నీ గురువు ఈరోజునే వస్తున్నాడు!” దివ్యమైన ఒక స్త్రీ కంఠస్వరం అన్నివేపులనుంచీ అవ్యక్తంలోంచి వినవచ్చింది.

ఇంతలో ఒక నిర్దిష్ట ప్రదేశంనుంచి కేక వినిపించడంతో నా అతీంద్రియానుభూతి పటాపంచలైంది. వంటింట్లోంచి, హాబు అనే మారు పేరుగల యువ పురోహితుడు పిలుస్తున్నాడు నన్ను.

“ముకుందా, ఇంక ధ్యానం చాలు! నువ్వో పనిమీద వెళ్ళాలి!”

మరోనాడయితే నేను ఓర్పు పట్టకుండా జవాబు ఇచ్చి ఉండేవాణ్ణి; ఇప్పుడు మాత్రం కన్నీళ్ళతో ఉబ్బిన మొహం తుడుచుకుని అణకువగా అతని మాట మన్నించాను. హాబుతో కలిసి, ఎక్కడో దూరంగా బెంగాలీ బస్తీలో ఉన్న బజారుకు బయల్దేరాను. బజారులో మేము సరుకులు కొనడం పూర్తి అయేసరికి సూర్యుడింకా నడినెత్తికి రాలేదు. ఇల్లాళ్ళు, గైడ్లు, పురోహితులు, సాదాబట్టలు కట్టుకున్న వితంతువులు, హుందాగా ఉండే బ్రాహ్మలు, ఎక్కడపడితే అక్కడ కనిపించే ఆంబోతులతోను మంచి రద్దీగా ఉన్న వీధిలో ముందుకు చొచ్చుకుంటూ వెళ్ళాం, నేనూ హాబూ ఆలా సాగిపోతూ ఉండగా, అతిసాధారణమైన ఒక సన్నటి సందువేపు తల తిప్పి చూశాను.

ఆ సందు చివర, స్వాములవారి మాదిరిగా కాషాయవస్త్రాలు ధరించిన క్రీస్తువంటి మహాపురుషు లొకరు నిశ్చలంగా నిలబడి ఉన్నారు. ఆ క్షణంలోనే కాక, యుగయుగాలుగా కూడా నాకు తెలిసినవారిలా కనిపించారాయన. ఒక్క క్షణం, నా చూపు ఆబగా ఆయన మీదే నిలిచింది. కాని ఇంతలోనే మళ్ళీ మనస్సులో ఒక శంక పుట్టింది.

“దేశాటనం చేసే ఈ సన్యాసిని చూసి, ఎవరో నీకు తెలిసినాయన