పుట:Oka-Yogi-Atmakatha.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుదేవులు శ్రీయుక్తేశ్వర్‌గారిని కలుసుకోడం

155

యిస్తోంది. నేను చూసిన క్షామబాధితుల చిత్రాలు, నా ముందు పిశాచాల్లా అల్లాడుతున్నాయి.

“కాశీలో మరుసటి ఆకలిచావు, ఈ క్షణంలోనే ఈ ఆశ్రమంలో సంభవించబోతోంది,” అనుకున్నాను. ఆ ప్రమాదం, తొమ్మిదిగంటల వేళకి తప్పిపోయింది. అమృతతుల్యమైన తియ్యని పిలుపు! ఆ రాత్రి భోజనం, నా జీవితంలో లోకల్లా పరిపూర్ణమైన ఘడియ మాదిరిగా స్పష్టంగా జ్ఞాపకాల్లో నిలిచిపోయింది.

నేను భోజనంలో ఎంత గాఢంగా మునిగిపోయినప్పటికీ, దయానందులు పరధ్యానంగా భోంచేస్తున్నారన్న సంగతి గమనించకపోలేదు. నేను కోరే మాదిరి భౌతిక సుఖాలకు ఆయన అతీతులయినట్టున్నారు.

“స్వామీజీ, మీకు ఆకలి వెయ్యలేదా?” నేను సుష్టుగా భోంచేసినందుకు సంతోషపడుతూ, పఠన మందిరంలో ఆయనతోబాటు ఒంటరిగాఉన్నాను.

“వేసింది!” అన్నారు. “గత నాలుగు రోజులూ తిండీ తీర్థం లేకుండా గడిపాను. రైలు ప్రయాణాల్లో నే నెన్నడూ తినను; ఐహిక వాంఛలతో కూడిన ప్రజలనుంచి వెలువడే విభిన్న స్పందనలతో నిండి ఉంటాయి రైళ్ళు. మాబోటి సన్యాసులకు విధించిన శాస్త్రనియమాల్ని నేను తూచా తప్పకుండా పాటిస్తాను.

“వ్యవస్థాపరమైన పనికి సంబంధించిన సమస్యలు కొన్ని నా మనస్సులో ఉన్నాయి. అంచేత ఈ రాత్రి భోజనం మీద మనస్సు పెట్టలేదు. తొందరేముంది? రేపు గుర్తు పెట్టుకొని సరిగా భోంచేస్తాలే,” అంటూ ఉల్లాసంగా నవ్వారాయన. ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లుగా నాలో లజ్జ వ్యాపించింది. కాని గడిచిన రోజంతా నేను అనుభవించిన హింస, అంత