పుట:Oka-Yogi-Atmakatha.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్‌చంద్ర బోసు

127

మీద ప్రయోగశాలలో త్వరగా ప్రయోగాలు జరపడం సులభంగా సాధ్యం కాదాండీ?”

“నువ్వు చెప్పింది నిజం. ముందుతరాల వాళ్ళు బోస్ పరికరాల్ని రకరకాలుగా ఉపయోగించుకుంటారు. శాస్త్రవేత్తకు, సమకాలిక పురస్కారం లభించడమన్నది అరుదు; సృజనాత్మక సేవలో కలిగే ఆనందం ఒక్కటి దక్కితే చాలు.”

ఓటమి నెరగని ఆ మునికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకొని సెలవు తీసుకున్నాను. “ఆశ్చర్యం కలిగించే ఆ మేధావి అసాధారణ ప్రజ్ఞాపాటవసారం హరించిపోవడమంటూ ఉంటుందా?” అని మనస్సులో అనుకున్నాను.

కాలం గడిచినా అది తరిగిపోలేదు. బోసుగారు, ‘రిసొనెంట్ కార్డియోగ్రాఫ్’ (హృచ్చలన లేఖని) అనే జటిలమైన పరికరాన్ని కనిపెట్టి, భారతదేశంలోని మొక్కల మీద లెక్కలేనన్ని ప్రయోగాలు చేశారు. వీటి పర్యవసానంగా ఉపయోగకరమైన మందులకు సంబంధించి, ఊహించినంత పెద్ద ఔషధ ప్రయోగ పద్ధతి వెల్లడి అయింది. ఒక సెకనులో వందో వంతు కాలాన్ని కూడా గ్రాపుమీద సూచించే విధంగా, ఒక్క పిసరు కూడా తేడా రానంత కచ్చితంగా పనిచేసే కార్డియోగ్రాఫ్‌ను తయారు చెయ్యడం జరిగింది. మొక్కలకూ జంతువులకూ మానవులకూ శరీర నిర్మాణంలో ఉండే అత్యంత సూక్ష్మమైన నాడీస్పందనల్ని రిసొనెంట్ రికార్డులు లెక్కకడతాయి. తన కార్డియోగ్రాఫ్ ముందుముందు, జంతువుల్ని కాకుండా మొక్కల్ని కోసి చూడడానికి ఉపయోగపడుతుందని ఆ ప్రసిద్ధ వృక్షశాస్త్ర వేత్త జోస్యం చెప్పారు.

“ఒక మొక్కకూ ఒక జంతువుకూ వేసిన మందువల్ల కలిగే ఫలితాల రికార్డింగ్‌లను పక్కపక్కన పెట్టి చూసినప్పుడు, అవి అచ్చూ