పుట:Oka-Yogi-Atmakatha.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్‌చంద్ర బోసు

125

ఆకట్టుకొన్నాయి. బోసు మహాశయులు (ఇక్కడ విలన్ పాత్రధారిగా) ఆ ఫెర్న్ మొక్కకు ఒకచోట, పదునైన పరికరం ఒకటి గుచ్చారు; వెంటనే ఆ మొక్క గిలగిలా కొట్టుకోడంతో ఎంత బాధపడుతోందో తెలిసింది. కాడలో కొంత మేరకు ఆయన కత్తి గుచ్చేసరికి మొక్క విపరీతంగా విలవిల్లాడిపోతున్నట్టు నీడలో కనిపించింది. చివరికి మరణ యాతన ముగిసిపోయి చలనం లేకుండా అయిపోయింది.

“మొదట, ఒక పెద్ద చెట్టుకు మత్తుమందు ఇచ్చి అంటుకట్టి విజయం సాధించాను. మామూలుగా, అటువంటి వనస్పతులు, ఉన్న చోటినించి కదిలించేసరికి తొందరగా చచ్చిపోతాయి.” ఆ ప్రాణరక్షణ వ్యూహాన్ని నెమరువేసుకొంటూ సంతోషంగా చిరునవ్వు నవ్వుకొన్నారు జగదీశ్‌చంద్ర బోసుగారు. “చెట్లకు ఒక (రస) ప్రసరణ వ్యవస్థ ఉందని సున్నితమైన నా పరికరాలు తయారుచేసిన రేఖాపటాలు నిరూపించాయి; వాటిలో ఉండే జీవరస చలనాలు, జంతుశరీరాల్లో రక్త సంచరణానికి సమానమైనవి. ఈ జీవరసం పైకి ఎలా ఎక్కుతుందో, మూమూలుగా ఒక దీపపు వత్తిలోకి నూనె ప్రవహించే మాదిరి యాంత్రిక ఆకర్షణ పద్ధతిలో వివరించడం సాధ్యం కాదు. ఈ దృగ్విషయం, సజీవ కణాలు పనిచేసే తీరువల్ల ఏర్పడుతోందని, క్రెస్కోగ్రాఫు ద్వారా వెల్లడి అయింది. చెట్టు దిగువ వరకు వ్యాపించి ఉండే స్తూపాకారపు గొట్టం నుంచి సర్పిలాకార తరంగాలు వెలువడతాయి; ఈ గొట్టం నిజంగా గుండెకాయలా పనిచేస్తుంది. లోతుగా చూసిన కొద్దీ, బహురూపాత్మకమైన ప్రకృతిలో ప్రతి ఒక్క రూపము, ఏకరూపాత్మకమైన ఒక ప్రణాళికతో ముడిపడి ఉన్నదన్న విషయం స్పష్టంగా సాక్షీభూతమవుతూ ఉంటుంది.

ఈ మహాశాస్త్రవేత్త, మరో బోస్ పరికరం వేపు చూపించారు.

“ఒక తగరపు ముక్క మీద ప్రయోగాలు చేసి చూపిస్తానుండు.