పుట:Oka-Yogi-Atmakatha.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

122

ఒక యోగి ఆత్మకథ

తుంది. అవి ప్రజాసంపద అవుతాయి. పేటెంటు హక్కులు ఏర్పరచుకోడం ఎన్నడూ జరగదు. విజ్ఞానాన్ని ఎన్నడూ, వ్యక్తిగత లాభంకోసం మాత్రమే వినియోగిస్తూ అపవిత్రం చెయ్యకుండా ఉండాలన్నది మన జాతీయ సంస్కృతి ఆశయం.

“ఈ సంస్థలో సదుపాయాలు, వీలున్నంత వరకు, అన్ని దేశాలనుంచి వచ్చిన కార్యకర్తలకూ అందుబాటులో ఉంటాయని కూడా ఆశిస్తున్నాను. ఈ రూపంలో, నా దేశం సంప్రదాయాన్ని కొనసాగించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఇరవై ఐదు శతాబ్దాలకు పూర్వమే భారతదేశం ప్రాచీనమైన నాలందా, తక్షశిలా విశ్వవిద్యాలయాలలో, ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థుల్ని చేర్చుకొన్నది.

“విజ్ఞానశాస్త్రమన్నది ప్రాచీ, ప్రతీచి దేశాలకు వేటికీ పరిమితం కాకుండా సార్వత్రికత విషయంతో అంతర్జాతీయతను సంతరించుకొన్న దైనప్పటికీ కూడా భారతదేశం, మహత్తర కృషి చెయ్యడానికి ప్రత్యేకంగా తగినది.[1] పైకి పరస్పర విరుద్దాలుగా కనిపించే యథార్థాల రాశిలో

  1. పదార్థం అణుఘటనల వల్ల ఏర్పడిందని ప్రాచీన హిందువులకు బాగా తెలుసు. భారతీయ షడ్దర్శనాల్లో.. ‘వైశేషికం’ ఒకటి. ఈ వైశేషక పదం, సంస్కృతంలో ‘విశేషస్’ అనే ధాతువు నుంచి వచ్చింది: అంటే “ఆణ్విక విశిష్టత” అని దీనికి అర్థం. సనాతన వైశేషిక దార్శనికుల్లో ఔలూక్యుడు ప్రముఖడు. ఈయనకే కణాదుడన్న పేరు కూడా ఉంది. కణాదుడంటే ‘కణాల్ని తినేవాడు’ అని అర్థం. ఈయన 2800 సంవత్సరాల కిందట జన్మించాడు. 1934 ఏప్రిల్ నెలలో వెలువడిన ‘ఈస్ట్-వెస్ట్’ పత్రిక సంచికలో వైశేషిక దర్శన సారాంశాన్ని ఈ విధంగా పొందుపరచడం జరిగింది: “ఆధునిక ‘అణుసిద్ధాంతం’ విజ్ఞానశాస్త్ర రంగంలో కొత్తగా వేసిన ముందడుగు అని, సాధారణంగా అందరూ భావిస్తూ ఉన్నప్పటికీ, ‘అణుభక్షకు’డైన కణాదుడు, దీన్ని చాలా కాలం కిందటే అద్భుతంగా వ్యాఖ్యానించాడు. ‘అణున్’ అనే సంస్కృత శబ్దాన్ని ఆంగ్లంలో ‘ఆటం’ అనీ చక్కగా అనువదించవచ్చు. గ్రీకు భాషలో దీనికి, ‘విడగొట్టరానిది’ అని వాచ్యార్థం. క్రీస్తుకు పూర్వం, వైశేషిక దర్శనానికి వెలువడ్డ ఇతర శాస్త్రీయ వ్యాఖ్యల్లో కింద పేర్కొన్న అంశాల్ని కూడా చేర్చడం జరిగింది: (1) సూదుల్ని అయస్కాంతం ఆకర్షించడం, (2) మొక్కలో జలప్రసరణం, (3) జడం, నిర్మాణరహితం అయిన ఆకాశం లేదా ఈథర్, సూక్ష్మశక్తుల్ని ప్రసారం చెయ్యడానికి ఆధారం కావడం, (4) అన్ని రకాల వేడికి సౌరాగ్నే కారణం, (5) అణు విపరిణామానికి ఆ వేడే కారణం, (6) భూమి అణువుల్లో ఉండే ఆకర్షణ గుణమే గురుత్వాకర్షణశక్తికి కారణం; వేటినైనా కిందికి లాక్కొనే శక్తి దీనివల్లే వచ్చింది, (7) అన్ని శక్తులకూ ఉండే చలన స్వభావం; దీనికి మూలకారణం శక్తివ్యయం లేదా చలనం తిరిగి పంపిణీ కావడం, (8) అణు విఘటనం ద్వారా విశ్వప్రళయం, (9) ఉష్ణకిరణాలూ కాంతికిరణాలూ చాలా చిన్న కణాలుగా ప్రసరించడం; ఈ కణాలు మనం ఊహించలేనంత వేగంతో (ఆధునిక ‘విశ్వకిరణ’ సిద్ధాంతం) అన్నివేపులకూ దూసుకుపోతాయి, (10) దేశకాలాల సాపేక్షత. ప్రపంచోత్పత్తికి మూలం స్వాభావికంగా అందే, వాటి తాత్త్విక విశేషతల రీత్యా- శాశ్వతమైన అణువులని చెబుతుంది వైశేషిక దర్శనం. ఈ అణువులకు అవిరామమైన స్పందన గతి ఉన్నట్టుగా భావించారు. అణువు చిన్న సైజు సూర్యమండల మన్న సంగతి ఇటీవల కనుక్కొన్నారు కాని, వైశేషిక మీమాంసకులకు అది కొత్త విషయమేమీ కాదు. వీరు కాలాన్ని గణితపరంగా విభజిస్తూ పోయి, ఒక అణువు తన ప్రదేశ పరిమాణం (unit of space) లో తాను తిరగడానికి పట్టే సమయాన్ని అన్నిటికంటే తక్కువ కాలపరిమాణం (Unit of time) (కళ) గా చెప్పారు.