పుట:Oka-Yogi-Atmakatha.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

118

ఒక యోగి ఆత్మకథ

టుగా చెయ్యి చేసుకుని దాని దర్జాకు భంగం కలిగించినా?’ అంటూ సానుభూతిపూర్వకంగా ఆయన పలికిన మాటలు మీ ఆవిష్కరణల ద్వారా అక్షరాలా రుజువయాయి.”

“సత్యానికి కవి సన్నిహితుడు; కాని శాస్త్రజ్ఞుడు దాంతో మొరటుగా వ్యవహరిస్తాడు. ఒకనాడు ఎప్పుడయినా నా ప్రయోగశాలకు వచ్చి, క్రెస్కోగ్రాఫు కున్న తిరుగులేని శక్తిని గమనించు.”

ఆయన ఆహ్వానాన్ని కృతజ్ఞతతో అందుకొని బయటికి వచ్చాను. తరవాత, ఆ వృక్షశాస్త్రవేత్త ప్రెసిడెన్సీ కాలేజీనించి వెళ్ళిపోయారని, కలకత్తాలో ఒక పరిశోధన కేంద్రం స్థాపించడానికి పథకం వేస్తున్నారని విన్నాను.

బోస్ సంస్థ ప్రారంభించినప్పుడు జరిగిన సమర్పణోత్సవానికి నేను హాజరయాను. ఉత్సాహవంతులైన వందలాది జనం ఆ సంస్థ ఆవరణలో విహరించారు. విజ్ఞానశాస్త్రానికి నూతన నిలయమైన ఈ సంస్థ భవనం కళానైపుణ్యానికీ ఆధ్యాత్మిక ప్రతీకకూ ముగ్ధుణ్ణి అయాను. దీని ముఖద్వారం, దూరాన ఎక్కడో కొన్ని శతాబ్దాలుగా పాడుబడి ఉన్న దేవాలయ శిథిలాల్లోంచి తెచ్చినది. ఒక తామర కొలను వెనక, కాగడా పట్టిన స్త్రీమూర్తి శిల్పం ఉంది. అమరజ్యోతిని ధరించే వ్యక్తి గా స్త్రీపట్ల భారతీయులకున్న గౌరవాన్ని ఇది తెలియజేస్తుంది.[1] ఒక తోటలో చిన్న దేవాలయం ఉంది. అది భౌతిక విషయాలకు అతీతుడైన నిరాకారుడికి

  1. తామరపువ్వు అన్నది భారతదేశంలో సనాతనమైన దైవీసంకేతం; విచ్చుకొంటున్న దీని రేకలు, ఆత్మవికాసాన్ని సూచిస్తాయి. ఇది పుట్టేది బురదలోనే అయినా స్వచ్ఛమైన సౌందర్యంతో పెరగడం, శుభప్రదమైన ఆధ్యాత్మిక వాగ్దానాన్ని సూచిస్తుంది.