పుట:Oka-Yogi-Atmakatha.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

116

ఒక యోగి ఆత్మకథ

పెట్టిన విప్లవాత్మకమైన విషయాలు భౌతిక శాస్త్రవేత్తగా సాధించిన విప్లవాత్మక విజయాలను మించిపోయాయి.

ఆయనకు నేను మర్యాదగా కృతజ్ఞతలు తెలిపాను. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఈ ప్రఖ్యాత శాస్త్రవేత్త మాతోబాటే ప్రెసిడెన్సీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు.”

మర్నాడు నేను, ఆ ఋషితుల్యుల నివాసానికి వెళ్ళి దర్శించాను. ఆయన ఇల్లు గుర్నార్ రోడ్డులో మా ఇంటికి దగ్గరిలోనే ఉంది. చాలా కాలంగా నేను ఆయన్ని దూరంనుంచే గౌరవభావంతో చూస్తూ ఉండేవాణ్ణి. గంభీరంగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్న ఈ వృక్షశాస్త్ర వేత్త, నన్ను ఆదరపూర్వకంగా పలకరించారు. ఆయన మంచి రూపసి; దృఢకాయులు. ఏభయ్యో పడిలో ఉన్నారు. జుట్టు ఒత్తుగా ఉంటుంది. నుదురు విశాలం. కలలు కనేవాడి కళ్ళలా, పరధ్యానంలో ఉండే కళ్ళు ఆయనవి. ఆయన కంఠస్వరాల్లోని నైశిత్యం, ఒక జీవితకాలంలో అలవడిన శాస్త్రీయమైన అలవాటును తెలియజేస్తోంది.

“ఈమధ్యనే నేను, పాశ్చాత్యదేశాల్లో ఉన్న వైజ్ఞానిక సంఘాల్ని సందర్శించే యాత్ర పూర్తిచేసుకొని తిరిగి వచ్చాను. ప్రాణు[1]లన్నిటిలోనూ ఉన్న అవిభాజ్యమైన ఏకత్వాన్ని ప్రదర్శించే విధంగా నేను కనిపెట్టిన సున్నితమైన పరికరాలపట్ల, ఆ సంఘాల సభ్యులు గాఢమైన ఆసక్తి కనబరిచారు. బోన్ క్రెస్కో గ్రాఫ్‌కు, ఉన్నదాన్ని కోటిరెట్లు పెద్దగా చేసి చూపించే బ్రహ్మాండమైన శక్తి ఉంది. సూక్ష్మదర్శిని అయితే కొన్ని వేల రెట్లు మాత్రమే పెద్దగా చేసి చూపిస్తుంది; అయి

  1. “శాస్త్రం యావత్తూ లోకాతీతమైనది; లేకపోతే అది నశించిపోతుంది. వృక్షశాస్త్రం ఇప్పుడు సరయిన సిద్ధాంతాన్ని సాధిస్తోంది. పరబ్రహ్మ అవతారాలు ఇప్పుడు ప్రకృతి చరిత్రకు సంబంధించిన పాఠ్యాంశాలవుతాయి ” – ఎమర్సన్ .