పుట:Oka-Yogi-Atmakatha.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

ఒక యోగి ఆత్మకథ

“ఆ సాధువు, ఇల్లు విడిచి ఎన్నడూ బయటికి వెళ్ళరని విన్నాను.” ఉపేంద్రుడి కంఠంలో కొద్దిగా అపసమ్మకం ధ్వనించింది.

“ముమ్మాటికీ నిజం! గత ఇరవై ఏళ్ళుగా ఆయన ఇల్లు విడిచి బయటికి రాలేదు. మనవాళ్ళ పర్వదినాల్లో మాత్రం ఆయన, తమకు తాము పెట్టుకొన్న నియమాన్ని కొద్దిగా సడలించి, గుమ్మం దాటి వీధి దాకా మాత్రం వెళ్తారు! భాదురీ మహాశయులది జాలిగుండె అని ప్రసిద్ధి. అంచేత ముష్టివాళ్ళు గుమ్మం దగ్గరికి చేరుతూంటారు.

“గురుత్వాకర్షణ శక్తిని ఉల్లంఘించి, గాలిలో ఎలా ఉంటారాయన?”

“నిర్ణీతమైన కొన్ని రకాల ప్రాణాయామాలు చేస్తే, యోగి శరీరానికి స్థూలత్వం పోతుంది. అప్పుడది పైకయినా లేస్తుంది, కప్ప మాదిరిగా కుప్పించి ఎగురుతూ నయినా ఉంటుంది. విధాయకమైన యోగాభ్యాసం చెయ్యని సాధువులు కూడా, గాఢమైన భక్తి పారవశ్య స్థితిలో ఉన్నప్పుడు అలా గాలిలో తేలుతూ ఉంటారని వింటాం.”

“ఈయన్ని గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది నాకు. సాయం సమయాల్లో ఆయన జరిపే సమావేశాలకు వెళ్తూ ఉంటావా?” ఉపేంద్రుడి కళ్ళు ఆసక్తితో మిలమిల మెరుస్తున్నాయి.

“ఆ, తరుచు వెళ్తూనే ఉంటాను. ఆయన జ్ఞానంలోని చమత్కారం, నాకు చాలా ఉల్లాసం కలిగిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను అదేపనిగా నవ్వుతూ ఉండడం వల్ల , సమావేశాల్లో గాంభీర్యం సడలిపోతూ ఉంటుంది. అందుకు ఆయనయితే ఏమీ అనుకోరు కాని, శిష్యులు మాత్రం కొరకొరా చూస్తుంటారు!”

ఆ రోజు మధ్యాహ్నం, బడినుంచి ఇంటికి వెళ్తూ, భాదురీ మహా