పుట:Oka-Yogi-Atmakatha.pdf/126

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలిలో తేలే సాధువు

105

భస్త్రిక ప్రాణాయామం చేస్తుంటే, గదిలో నిజంగా తుఫాను వచ్చిందేమో అనిపించింది; అంత అద్భుత శక్తితో చేశారన్న మాట. తరవాత, ఉరుము ఉరుముతున్నట్టుగా వెలువడే ఊపిరిని పూర్తిగా బయటికి వదిలేసి ఉన్నతమైన అధిచేతన[1] స్థితిలో నిశ్చలంగా ఉండిపోయారు. ఆ తుఫాను వెలిసిన తరవాత ఏర్పడ్డ ప్రశాంతత, ఎన్నటికీ మరిచిపోలేనంతగా, నా మనస్సులో ఇప్పటికీ అనుభూతమవుతూ ఉంటుంది.

  1. ఫ్రెంచి మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపి అధిచేతనను గుర్తించారని సోర్బన్‌లో ఉండే ప్రొఫెసర్ జులే బోయా 1928 లో చెప్పాడు . అత్యద్భుతమైన ఈ అధిచేతన, “ఫ్రాయిద్ భావించిన అవచేతన మనస్సుకు సరిగా వ్యతిరేకమైనది; మానవుణ్ణి కేవలం ఉన్నతజాతి జంతువుగా కాకుండా నిజంగా మానవుడిగా చేసే శక్తులు దీంట్లో ఉన్నాయి,” అని కూడా ఆయన అన్నాడు. ఉన్నతమైన చేతన జాగృతం కావడం అంటే, “కుయేయిజం [మనోవిశ్లేషణ పరమైన చికిత్సా విధానం] అని కాని సమ్మోహన శక్తి అని కాని అనుకోగూడదు,” అని ఆ ఫ్రెంచి శాస్త్రవేత్త వివరించాడు. అధిచేతన మనస్సు ఉనికిని తాత్త్వికంగా చాలాకాలం కిందటే గుర్తించారు; నిజానికి ఎమర్సన్ ‘ఓవర్ - సోల్’ అని చెప్పింది దీన్ని ఉద్దేశించే; కాని దీన్ని శాస్త్రీయంగా గుర్తించింది మాత్రం మొన్నమొన్ననే. “ది ఓవర్ - సోల్” అన్న దాంట్లో ఎమర్సన్ ఇలా రాశాడు: “మనిషి, జ్ఞానమంతా, ఉత్తమత్వమంతా నెలకొని ఉండే ఆలయానికి ముఖతలం వంటివాడు తింటూ, తాగుతూ, మొక్కలు నాటుతూ, లెక్కలు వేస్తూ ఉండే, మనకు తెలిసిన మామూలు మనిషినే మనం సామాన్యంగా మనిషి అని అంటూ ఉంటాం. కాని అతడు తన గురించి తాను సరిగా తెలుసుకోలేడు సరికదా, తప్పుగా తెలుసుకుంటాడు. వాణ్ణి మనం గౌరవించం; వాడు అంగభూతంగా ఉన్న ఆత్మను గౌరవిస్తాం. వాడు తన చేతలద్వారా దాన్ని కనబరుస్తాడు; మన చేత మొక్కించు కుంటాడు. ఆధ్యాత్మిక ప్రకృతి అగాధాలకూ, భగవంతుడి సకల గుణాలకూ ఒక పక్కగా పడుకొని ఉంటాం మనం.”