పుట:Oka-Yogi-Atmakatha.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 7

గాలిలో తేలే సాధువు

“ఒక యోగి, భూమికి కొన్ని అడుగుల ఎత్తున గాలిలో తేలడం నిన్న రాత్రి ఒక చిన్న సమావేశంలో చూశాను,” అంటూ మా స్నేహితుడు ఉపేంద్ర మోహన్ చౌధరి నాకు నొక్కి చెప్పాడు.

నేను ఉత్సాహంగా చిరునవ్వు నవ్వాను. “ఆయన పేరు నేను ఊహించగల ననుకుంటాను. అప్పర్ సర్క్యులర్ రోడ్డులో ఉండే భాదురీ మహాశయులే కదూ?” అని అడిగాను. తాను చెప్పింది నాకు కొత్త సంగతి కాదని తేలిపోవడంతో కొద్దిగా దిగాలుపడుతూ, ఉపేంద్రుడు తల ఊపాడు. సాధువులగురించి తెలుసుకోడమంటే నాకు ఎంత ఆసక్తి ఉందో మా స్నేహితులకు తెలుసు; ఎప్పటికప్పుడు నన్ను ఒక కొత్తదారి పట్టించడం వాళ్ళకొక సరదా. “ఆ యోగి మా ఇంటికి దగ్గరిలోనే ఉంటారు. ఆయన్ని చూడ్డానికి తరచుగా వెళ్తూనే ఉంటాను.” నా మాటలకు ఉపేంద్రుడి ముఖంలో గాఢమైన ఆసక్తి పొడగట్టింది. అప్పుడు నే నింకా చెప్పాను.

“ఆయన అద్భుతమైన యోగక్రియలు చెయ్యడం చూశాను. అష్టాంగ యోగంలో పతంజలి[1]చెప్పిన రకరకాల ప్రాణాయామాల్ని[2] ఆయన గొప్పగా సాధన చేశారు. ఒకసారి బాదురీ మహాశయులు నా ఎదుట

  1. ప్రాచీన యోగశాస్త్రానికి మొట్టమొదటి వ్యాఖ్యాత.
  2. శ్వాసను క్రమబద్ధం చేసి ప్రాణశక్తిని, అదుపులోకి తెచ్చుకొనే పద్ధతులు. భస్త్రిక ప్రాణాయామం, మనస్సును నిలకడగా ఉంచుతుంది.