పుట:Oka-Yogi-Atmakatha.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

ఒక యోగి ఆత్మకథ

“అడవి జంతువు లన్నిటిలోకీ ఎక్కున భయంకరమైన రాయల్ బెంగాల్ పులుల్ని ఉత్తి పిడికిళ్ళతోనే లొంగదీసుకోడం మీకు ఎలా సాధ్యమైందో, దయచేసి మాకు చెప్పరూ?”

“అబ్బాయిలూ, పులులతో పోట్లాడ్డం అన్నది నాకు చాలా చిన్న విషయం. అవసరమైతే ఈవేళ కూడా ఆ పని చెయ్యగలను.” పసివాడిలా నవ్వారాయన. “మీరు పులుల్ని పులుల్లా చూస్తారు; వాటిని పిల్లులుగా నే నెరుగుదును.”

“స్వామీజీ, పులులు పిల్లులేనని నా మనస్సు (అవచేతన) కయితే నచ్చజెబుతాననుకోండి, కాని పులులకు నచ్చజెప్పగలనా?”

“బలం కూడా అవసరమన్న మాట నిజమే! పులిని పిల్లిలా ఊహించుకునే పసివాడు దాన్ని గెలవాలని ఎవరూ ఆశించకపోవచ్చు! బలమైన నా చేతులే నాకు చాలే ఆయుధాలు.”

మమ్మల్ని వెంట బెట్టుకుని పెరట్లోకి వచ్చారాయన. అక్కడ గోడ అంచున ఒక్క గుద్దు గుద్దారు. దాంతో ఒక ఇటిక కిందికి రాలి పడింది. తొస్సి పన్నులా కనిపించే గోడ కన్నంలోంచి ఆకాశం ధైర్యంగా తొంగి చూసింది. ఆశ్చర్యంతో వెర్రిచూపులు చూశాను నేను. సున్నంతో గట్టిగా కట్టిన గోడలో ఉన్న ఇటికనే ఒక్క గుద్దుతో రాలగొట్టగలిగిన ఈయన, పెద్దపులుల పళ్ళు రాలగొట్టడంలో సందేహం లేదనిపించింది!

“నాలాగే కొందరికి దేహదారుఢ్యం ఉంటుంది; కాని వాళ్ళకి నిబ్బరమైన నమ్మకం ఉండదు. ఒంటిని మాత్రమే వస్తాదుల్లా పెంచుకొని మనస్సును అలా పెంచుకోనివాళ్ళు, అడవిలో స్వేచ్ఛగా తిరిగే క్రూరమృగం ఏదైనా కంటబడితే చాలు, ఇట్టే కళ్ళు తేలవేస్తారు. సహజమైన