పుట:Oka-Yogi-Atmakatha.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

12

సంరక్షణ మా శవాగార చరిత్రలో, మాకు తెలిసినంతవరకు, సాటిలేనిది . . ,యోగానందగారి శవాన్ని స్వీకరించినప్పుడు శవాగార సిబ్బంది, శరీర క్షయానికి సంబంధించిన మామూలు క్రమగత పరిణామ చిహ్నాల్ని, శవపేటిక మీద ఉన్న గాజుమూతలోంచి గమనించవచ్చునని భావించారు. ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ పరిశీలనలో ఉంచిన ఈ శరీరంలో మార్పేమీ రాకపోవడంతో మా ఆశ్చర్యం పెరుగుతూ వచ్చింది. యోగానందగారి శరీరం, అద్భుత నిర్వికారస్థితిలో ఉన్నట్టు కనిపించింది. . .ఏ సమయంలోనూ కూడా ఆయన శరీరం నుంచి దుర్వాసన వెలువడ లేదు.

“యోగానందగారి భౌతిక రూప దర్శనం, మార్చి 7 తేదీన ఎలా ఉందో, శవపేటిక మీద కంచుమూత పెట్టి మూసిన, మార్చి 27 తేదీ వరకు అచ్చంగా ఆలాగే ఉంది.. ఆయన చనిపోయిననాటి రాత్రి ఎంత తాజాగా, ఎంత నిర్వికారంగా కనిపించారో, మార్చి 27 న కూడా అలాగే కనిపించారు. ఆయన దేహం అసలు, కంటికి కనిపించే శారీరక విఘటనానికి గురి అయిందని చెప్పడానికి మార్చి 27 న ఏ దాఖాలా కనిపించ లేదు. ఈ కారణాలపల్ల పరమహంస యోగానందగారి వృత్తాంతం మా అనుభవంలో అద్వితీయమైనదని మళ్ళీ చెబుతున్నాం."