పుట:Oka-Yogi-Atmakatha.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

ఒక యోగి ఆత్మకథ

“ఆయన శిష్యులైన గంధబాబాగారు అన్ని సమయాల్లోనూ, ఇప్పుడు నువ్వు చూసిన మాదిరిగా, కేవలం మాటలతో వాసనలు సృష్టించరు.” గురువుగారిని చూసుకొని గర్విస్తూ మాట్లాడాడు ఆ శిష్యుడు. “వ్యక్తుల స్వభావాల్లోని వైవిధ్యానికి తగ్గట్టుగా ఈయన పద్ధతి చాలా మారుతూ ఉంటుంది. ఈయన అద్భుతమైన వ్యక్తి! కలకత్తా మేధావుల్లో చాలామంది ఈయన అనుచరులు.”

నేను వాళ్ళలో కలవగూడదని మనస్సులో తీర్మానించుకున్నాను. అక్షరాలా “అద్భుతమైన” వ్యక్తి అనిపించుకునే గురువంటే నాకు కిట్టదు. గంధబాబాగారికి మర్యాదగా ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాను. మెల్లగా ఇంటి మొహం పట్టి నడుస్తూ, ఆనాడు జరిగిన మూడు సంఘటనల గురించీ ఆలోచన సాగించాను.

నేను గుమ్మంలోకి వెళ్ళే సరికి మా అక్క ఉమ ఎదురయింది.

“బలే షోగ్గా తయారవుతున్నావు, సెంట్లు పూసుకుంటూ;”

ఒక్క పలుకు కూడా పలకకుండా, ఆమెకు చెయ్యి వాసన చూపించాను.

“ఎంత మంచి గులాబివాసనో! దీనికి అసాధారణమైన ఘాటు ఉంది.”

దీంట్లో “ఘాటైన అసాధారణత” ఉందని అనుకుంటూ నేను, చడీ చప్పుడూ లేకుండా, అలౌకిక పద్ధతిలో సుగంధబంధురం చేసిన పువ్వును ఆమె ముక్కు దగ్గర పెట్టాను.

“ఓహ్, మల్లిపువ్వు నాకు చాలా ఇష్టం!” అంటూ పువ్వులాగేసుకుంది ఉమ. తీరా చూస్తే, అది వాసనలేని పువ్వుల్లో ఒక రకం. ఆ సంగతి ఆమెకు బాగా తెలుసు. కాని దాంట్లోంచి, మాటిమాటికీ మల్లిపువ్వు