పుట:Nutna Nibandana kathalu.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యెరూషలేముపంపి అక్కడ విచారణ జరిపింపవలసిందిగా అర్థించారు. కాని పౌలు నేను రోమను పౌరుణ్ణి. నన్ను రోములో రోమను చక్రవర్తే విచారించాలని పట్టపట్టాడు. యెరూషలేములో తనకు న్యాయం జరగదని పౌలుకి తెలుసు. ఫెస్తు అంగీకరించాడు.

యూలి అనే సైన్యాధిపతి ఆధీనంలో పౌలు ఓడనెక్కి రోముకు ప్రయాణమయ్యాడు. కాని దారిలో కౌదా అనే నగరం దగ్గర వోడ తీవ్రమైన తుఫానులో చిక్కుకొంది. అందరూ ప్రాణాలమీద ఆశ వదలుకొన్నారు. పౌలుకి ఓ దేవదూత దర్శనమిచ్చి ఓడలోని వారెవరూ చనిపోరని అభయమిచ్చాడు. పదిహేను రోజుల తుఫాను తర్వాత ఓడ యిసుకదిబ్బలో దిగబడి బ్రద్దలై పోయింది. ఓడలోని 276 మంది ప్రయాణికులు సురక్షితంగా వొడ్డు చేరుకొన్నారు. అదే మాల్టా దీవి.

అప్పడు చలిగా వున్నందున ఆ దీవివాసులు ఆగంతుకులకు చలిమంట వేశారు. పౌలు మంటలో వేయడానికి కొన్ని పుల్లలు ఏరుకొని రాగా ఓ విషసర్పం అతని చేతికి చుట్టుకొంది. కాని అతడు చేయి విది లించగా అది మంటలో పడింది. అక్కడి జనం పౌలునేరగాడై వుంటాడనీ సముద్రాన్ని తప్పించుకొన్నా పాముకాటుని తప్పించుకోలేడనీ, న్యాయమేతీర్పు చెప్తుందనీ భావించారు. కాని అతనికి ఏహాని కలగక పోవడం చూచి అతడు నిజంగా దేవుడు అనుకొన్నారు. అక్కడ పుబ్లియు అనే ప్రముఖడు వున్నాడు. అతడు ఆగంతుకులకు మూడు రోజుల పాటు భోజనం పెట్టాడు. అతని తండ్రి జబ్బుగా పడివుండగా పౌలు వ్యాధి నయం జేశాడు. ఇతర రోగులుకూడ వచ్చి జబ్బులు నయం జేయించు కొన్నారు. అక్కడి ప్రజలు పౌలుకీ అతని అనుచరులకూ భోజన పదార్థాలు ఇచ్చి ఆదర పూర్వకంగా సాగనంపారు.

పౌలు మళ్లా మాల్టాలో వోడనెక్కి పుతోలిలో దిగి అక్కడి నుండి కాలి నడకన రోము చేరుకొన్నాడు. ఆ ప్రాంతంలోని విశ్వాసులు దారి