పుట:Nutna Nibandana kathalu.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యూదులు ఈలాగే బంధించి రోమీయులకు అప్పగిస్తారు అని ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనాన్ని విని అక్కడి వాళ్లు యెరూషలేము వెళ్లవద్దని పౌలుని బతిమాలారు. కాని అతడు నేను బందీనై యేసు కొరకు ప్రాణాలు అర్పించడానికీ కూడ సిద్ధంగా వున్నాను అని పల్కాడు. ఆ ప్రజలు అతని ప్రయత్నాన్ని మార్చలేకపోయారు.

108. పౌలు చరమదశ - అచ 21-28

పౌలు యెరూషలేము చేరుకొని అక్కడి సమాజానికి పెద్దయైన యాకోబును కలసికొన్నాడు. ఆ పిమ్మట దేవాలయానికి వెళ్లాడు. అక్కడి యూదులు అతన్ని చూచి రెచ్చిపోయి ఇతడు మన ధర్మశాస్తానికీ దేవాలయానికీ వ్యతిరేకంగా మాటలాడుతున్నాడు. అన్యజాతి వారిని దేవళం లోనికి తీసుకొచ్చాడు. ఇతన్ని వధించండి అని అరచి పౌలుమీద పడి చంప బోయారు. కాని రోమను సైన్యాధిపతి వచ్చి పౌలుని కోటలోనికి తీసికొని పోయాడు.

పౌలుని చంపిందాకా అన్నపానీయాలు ముట్టమని నలబైమంది యూదులు శపథం చేసి సమయం కొరకు కాచుకొని వున్నారు. ఈ సంగతి పౌలు మేనల్లుడు పసికట్టి సైన్యాధిపతికి తెలియజేశాడు. అతడు పౌలుని రాత్రిలో రహస్యంగా కైసరయలోవున్న రాష్ట్రపాలకుని వద్దకు పంపాడు. అతనికి జాబుకూడ వ్రాశాడు. ఆ పాలకుడు ఫేలిక్సు.

పొలు రాష్ట్రపాలకుని ఆధీనంలో వుండగా యెరూషలేమునుండి యూదనాయకులు వచ్చి అతని మీద నేరాలు మోపారుకాని రుజువు చేయలేకపోయారు. పౌలు రెండేండ్లు కైసరయలో చెరలో వున్నాడు. ఫేలిక్సు పౌలుతో మాటలాడి అతని బోధను విన్నాడు. పౌలు నుండి లంచం తీసికొని అతన్ని విడిపింపగోరాడు. కాని పౌలు లంచం ఈయలేదు. అటు తర్వాత ఫేలిక్సు మారిపోయి ఫెస్తు రాష్ట్రపాలకుడుగా వచ్చాడు.

యూద నాయకులు మళా ఫెసు దగ్గరికి వచ్చి పౌలుని